iDreamPost
android-app
ios-app

ముచ్చటగా మూడో ఏడాది సంక్షేమ క్యాలెండర్‌

ముచ్చటగా మూడో ఏడాది సంక్షేమ క్యాలెండర్‌

సంక్షేమ పథకాల అమలులో నూతన ఒరవడిని సృష్టించిన సీఎం జగన్‌.. దాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. భారతదేశ చరిత్రలో మునుపెన్నడూలేని విధంగా సంక్షేమ పథకాలకు క్యాలెండర్‌ విడుదల చేస్తూ సంక్షేమ పాలనకు సరికొత్త నిర్వచనం ఇస్తున్నారు. ముచ్చటగా మూడో ఏడాది కూడా సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను సీఎం జగన్‌ ఈ రోజు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది (2022 ఏప్రిల్‌–2023 మార్చి) వరకు అమలు చేయబోయే పథకాలను తేదీల వారీగా నిర్ణయించారు. బడ్జెట్‌ సమావేశాల ముగింపు సందర్భంగా సీఎం జగన్‌ ఈ క్యాలెండర్‌ను విడుదల చేశారు.

ఇదీ క్యాలెండర్‌

– 2022.. ఏప్రిల్‌లో వసతి దీవెన, వడ్డీలేని రుణాలు
– మేలో విద్యా దీవెన, అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌, రైతు భరోసా, మత్స్యకార భరోసా
– జూన్‌లో అమ్మ ఒడి పథకం
– జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు.
– ఆగష్టులో విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్‌, నేతన్న నేస్తం.
– సెప్టెంబర్‌లో వైఎస్సార్‌ చేయూత
– అక్టోబర్‌లో వసతి దీవెన, రైతు భరోసా
– నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు
– డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు
– 2023.. జనవరిలో రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు పథకాలు
– ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు
– మార్చిలో వసతి దీవెన అమలు