iDreamPost
android-app
ios-app

గుడివాడలో టిడ్కో ఇళ్లను ప్రారంభించిన సీఎం జగన్..

గుడివాడలో టిడ్కో ఇళ్లను ప్రారంభించిన సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తనదైన పాలనతో  దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరుకు సీఎం జగన్ పూర్తి చేసి నాలుగేళ్ల పరిపాలనలో  ఎన్నో  ఘనతలు సాధించారు. ఎంతలా అంటే.. తాను ప్రవేశ పెట్టిన పథకాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాపీ చేసేంతలా. సీఎం జగన్ .. తన పరిపాలనలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ఎన్నో రకాల పథకాలను ప్రవేశ పెట్టి ప్రజలను ఆర్థికంగా నిలదొక్కోవడంతో పాటు అభివృద్ధి పథంలో నడిచేలా చేశారు. ఇప్పటికే ప్రజలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందించిన జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా టిడ్కో ఇళ్లను కూడా ప్రారంభించారు.

శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  గుడివాడలో పర్యటించారు.  అక్కడ టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన లబ్ధిదారులను, ఏపీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.  రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది జగనన్న కాలనీలు కాదని, ఏకంగా ఊర్లు కడుతున్నామని సీఎం జగన్ ఉద్ఘాటించారు. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా టిడ్కో ఇళ్లు కట్టిస్తామన్న మాటను నెరవేర్చామని ఆయన తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..” ప్రతి లబ్ధిదారునికి రూ.7 లక్షల ఆస్తిని ఉచితంగా ఇచ్చాం. అక్కచెల్లెమ్మల చేతిలో రూ.6-15 లక్షల  విలువ చేసే ఆస్తి పెట్టాము.పేదలకు రూపాయికే 300 అడుగుల టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామని చెప్పాము. ఒక పక్కన టిడ్కో ఇళ్లు, మరో పక్క ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణం చేస్తున్నానం. వీటన్నింటి మధ్య ఈ రోజు కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది.

ఇది కేవలం ఓ కార్యక్రమం కాదు.. మహా యజ్ఞం. పేద  ప్రజలకు టిడ్కో ఇళ్లను అందించడం దేవుడు నాకిచ్చిన అవకాశం”  అని సీఎం జగన్ అన్నారు. అంతేకాక  టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విరుచక పడ్డారు. చంద్రబాబు హయంలో.. నేల మీద ఇళ్లు లేవని, పట్టాలేదు.. ఉచితంగా  ఇచ్చింది అంతకన్నా లేదని  సీఎం జగన్ అన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే అక్కడ డెమో గ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని ఏకంగా కోర్టల్లో కూడా నిస్సిగ్గుగా వాదించారని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం  చేసిన ఇన్ని మంచి కార్యక్రమాలు మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న బాబు ఎందుకు చేయలేదని? సీఎం జగన్ నిలదీశారు. మరి.. సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడివాడలో చేసిన ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్  రూపంలో తెలియజేయండి.