iDreamPost
android-app
ios-app

కోర్టు వేదికగా… కుటుంబ సభ్యులకు షాక్‌ ఇచ్చిన చంద్రబాబు..!

  • Published Oct 20, 2023 | 11:20 AM Updated Updated Oct 20, 2023 | 11:20 AM

చంద్రబాబు అరెస్ట్‌ అయిన నాటి నుంచి ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌, కోడలు నారా బ్రాహ్మణి అనేక ఆరోపణలు చేస్తూ వస్తోన్నారు. కానీ అనూహ్యంగా వారికి షాక్‌ ఇచ్చారు చంద్రబాబు. అది కూడా కోర్టు వేదికగా.. ఇంతకు ఏం జరిగింది అంటే..

చంద్రబాబు అరెస్ట్‌ అయిన నాటి నుంచి ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌, కోడలు నారా బ్రాహ్మణి అనేక ఆరోపణలు చేస్తూ వస్తోన్నారు. కానీ అనూహ్యంగా వారికి షాక్‌ ఇచ్చారు చంద్రబాబు. అది కూడా కోర్టు వేదికగా.. ఇంతకు ఏం జరిగింది అంటే..

  • Published Oct 20, 2023 | 11:20 AMUpdated Oct 20, 2023 | 11:20 AM
కోర్టు వేదికగా… కుటుంబ సభ్యులకు షాక్‌ ఇచ్చిన చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో వందల కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని తెలడంతో.. ఏపీ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. 41వ రోజు రిమాండ్‌ ఖైదీగా కొనసాగుతున్నారు. నవంబర్‌ 1 వరకు చంద్రబాబు రిమాండ్‌లోనే ఉండాలని ఏసీబీ కోర్డు ఆదేశించింది. ఇక ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఇక ఇదిలా ఉండగా.. గురువారం ఏసీబీ కోర్టు వర్చువల్‌ విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు.. ఆయన కుటుంబ సభ్యులకు ఊహించని షాక్‌ ఇచ్చారు.

బాబు తీరుపై టీడీపీపై శ్రేణులు ఆశ్చర్యపోతున్నారు. ఇక జనాలైతే.. ఇంకా ఎన్నాళ్లిలా అబద్దాలు ప్రచారం చేస్తూ.. ప్రజలని మోసం చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. కోర్టు విచారణ సందర్భంగా తన ఆరోగ్యం గురించి చంద్రబాబు ఇచ్చిన సమాధానాలు చూస్తే.. బయట ఆయన కుటుంబ సభ్యులు చేస్తోన్న ప్రచారం అసత్యం అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యింది. అసలేం జరిగింది అంటే..

చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్‌ ట్వీట్‌ ఇలా..

ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ఆయన భార్య, కుమారుడు, కోడలు.. చంద్రబాబు ఆరోగ్యం గురించి తీవ్ర ఆదందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని.. ఉద్దేశపూర్వకంగా కావాలనే ఆయనకు హాని తలపెడుతున్నారని ఆరోపించారు. ఆయనకు సరైన భద్రత లేదని.. ప్రమాదంలో ఉన్నారన్నారు. చంద్రబాబు డీహైడ్రేషన్, బరువు తగ్గారు, ఇన్‌ఫెక్షన్, అలర్జీతో బాధపడుతున్నారని లోకేష్‌ ఆరోపించారు.

జైల్లో దోమల బెడదతో పాటుగా కలుషితమైన నీటిని అందిస్తున్నారని లోకేష్‌ ఆరోపించారు. అలాగే ఆయనకు సరైన వైద్యం కూడా అందడం లేదన్నారు. అంతటితో ఆగక మరో అడుగు ముందుకు వేసి.. ఏకంగా ఏపీ ప్రభుత్వం చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అధికార యంత్రాంగం, ప్రభుత్వ డాక్టర్లు ఏదో దాచేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్ బాధ్యత వహించాలంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

భార్య, కోడలు ఆరోపణలు ఇవి..

ఇక చంద్రబాబు భార్య భువనేశ్వరి జైలులో తన భర్తకు సకాలంలో వైద్యం అందించలేదని.. ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారన్నారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులన్నారని.. జైలులో ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు భువనేశ్వరి. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని.. జైలులో పరిస్థితులు తన భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయన్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారని జనాల ముందు ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు.

అలానే చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కూడా.. జైల్లో చంద్రబాబు పరిస్థితి చూసి చాలా బాధగా ఉందని.. జైల్లో అపరిశుభ్రమైన వాతావరణం ఉందని.. దీని వల్ల ఆయన ఆరోగ్యానికి ముప్పు ఉందన్నారు. తాము ప్రైవేట్ డాక్టర్లను సంప్రదించగా సీరియస్ అంశంగా చెప్పారని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగక చంద్రబాబు ఆరోగ్య సమస్యపై కోర్టును కూడా ఆశ్రయించి బుద్ధి చెప్తామని.. హెచ్చరించారు. మరి తీరా నిన్న ఏసీబీ కోర్టు విచారణ సందర్భంగా ఏం జరిగింది అంటే..

జడ్జి ముందు బాబు చెప్పిన నిజాలు..

►గురువారం వర్చువల్‌ విచారణ టైంలో చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన జడ్జి
ఏసీబీ కోర్టు జడ్జి : ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది?
చంద్రబాబు : ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నాయి.
ఏసీబీ కోర్టు జడ్జి : జైల్లో డాక్టర్లున్నారు కదా, ప్రతి రోజూ చెక్‌ చేస్తున్నారా?
చంద్రబాబు : అవును.. డాక్టర్లు ప్రతి రోజూ వచ్చి చెక్‌ చేస్తున్నారు.
ఏసీబీ కోర్టు జడ్జి : డాక్టర్లు హెల్త్‌ రిపోర్ట్‌ ఇస్తున్నారా?
చంద్రబాబు : అవును.. డాక్టర్లు ఏ రోజుకారోజు హెల్త్‌ రిపోర్టు ఇస్తున్నారు.
ఏసీబీ కోర్టు జడ్జి : ఇంకా మీకు ఏమైనా సమస్యలున్నాయా?
చంద్రబాబు : జెడ్‌ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడిని నేను, నాకు సెక్యూరిటీపై అనుమానాలున్నాయి.
ఏసీబీ కోర్టు జడ్జి : మీకున్న సందేహాలను రాతపూర్వకంగా ఇవ్వండి, పరిశీలిస్తాం.

ఇవి చంద్రబాబు స్వయంగా జడ్జి ఎదుట చంద్రబాబు చెప్పిన మాటలు. కానీ బయట ఆయన కుటుంబ సభ్యులు మాత్రం.. జైల్లో బాబు ఆరోగ్యం పూర్తిగా విషమించింది అన్న రేంజ్‌లో బిల్డప్పులు ఇచ్చారు. కానీ కోర్టు విచారణ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు షాక్‌ ఇస్తూ.. తాను బాగానే ఉన్నానని స్వయంగా చెప్పుకొచ్చారు.  చంద్రబాబు మాటలు విన్న జనాలు.. ఇంత జరిగినా ఇంకా మీకు బుద్ధి రావడం లేదా అని ప్రశ్నిస్తున్నారు జనాలు.