దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన మణిపూర్ ఘటన ఇంకా చల్లారలేదు. ఓ తెగకు చెందిన ఇద్దరు మహిళలను మరో తెగకు చెందిన పురుషుల గుంపు నగ్నంగా ఊరేగించి, వారిపై అత్యచారం జరిపిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బాధితులకు న్యాయం చేస్తూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళ, ప్రజా సంఘాలు, విపక్ష పార్టీలు ఆందోళనలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీ సైతం ఇది అమానవీయ, దేశం సిగ్గుతో తలదించుకునే సంఘటనగా పేర్కొన్నారు.
అయినా కూడా గత రెండు నెలలకు పైగా మణిపూర్ అల్లర్లతో అట్టుడుకుతుంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ?, అల్లర్లను ఎందుకు అడ్డుకోవడం లేదని విపక్ష పార్టీలు, సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో సైతం మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వ తీరుని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు మణిపూర్‌పై చర్చకు పట్టుబడుతుండటంతో సభ సోమవారానికి వాయిదా పడింది. దేశ వ్యాప్తంగా ఇంత సంచలనం సృష్టించిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించేందుకు నిరాకరించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇటీవల ఆయనను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది ఆ పార్టీ అధినాయకత్వం. అయితే.. మణిపూర్ ఘటనపై ఆయనను ఓ ప్రముఖ మీడియా ఛానెల్ ప్రతినిధి ప్రశ్నించగా.. కిషన్ రెడ్డి అసహనానికి గురయ్యారు. మణిపూర్ ఘటనపై నాకేం సంబంధం, నాకిప్పుడు మినిస్టీ లేదు. మినిస్టీతో నాకు సంబంధం లేదంటూ దురుసుగా ప్రవర్తించారు. కానీ, ఆయన అధికారికంగా ఇంకా కేంద్ర మంత్రిగానే కొనసాగుతున్నారు. పైగా ఆయన ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. మరి మణిపూర్ ఘటనతో నాకేం సంబంధం అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మణిపూర్ ఘటన నాకేం సంబంధం అంటూ ABN రిపోర్టర్ పై కిషన్ రెడ్డి అసహనం #kishanreddy #bjp #manipurissue #abnreporter #abn #abntelugu @kishanreddybjp @BJP4India pic.twitter.com/OM8vPnZMmf
— ABN Telugu (@abntelugutv) July 22, 2023
ఇదీ చదవండి: మణిపూర్ లో స్త్రీలను నగ్నంగా ఉరేగించడంపై ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్!