iDreamPost
android-app
ios-app

బిగ్‌ బ్రేకింగ్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో నిందితురాలిగా కవిత!

  • Published Feb 23, 2024 | 4:28 PM Updated Updated Feb 23, 2024 | 4:44 PM

MLC Kavitha, Delhi Liquor Scam: బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ఊహించని షాకిచ్చింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆమె పేరును నిందితురాలిగా చేర్చింది సీబీఐ. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

MLC Kavitha, Delhi Liquor Scam: బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ఊహించని షాకిచ్చింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆమె పేరును నిందితురాలిగా చేర్చింది సీబీఐ. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 23, 2024 | 4:28 PMUpdated Feb 23, 2024 | 4:44 PM
బిగ్‌ బ్రేకింగ్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో నిందితురాలిగా కవిత!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో పలు సార్లు సీబీఐ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితను.. నిందితురాలిగా చేర్చింది సీబీఐ. ఈ విషయమై కవితకు సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు జారీ చేసి.. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ షాకింగ్‌ ట్విస్ట్‌తో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఆమెను త్వరలోనే అరెస్ట్‌ కూడా చేసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాగా 2022లోనే కవితను ఈ కేసు విషయంలో సీబీఐ విచారించింది. ఈ కేసులోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్య నేత మనీష్‌ సిసోడియాను కూడా అరెస్ట్‌ జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్‌ క్రేజీవాల్‌ కూడా పలుమార్లు నోటీసులు జారీ అయ్యాయి.

2021-22 మధ్య మొదలైన ఈ లిక్కర్‌ కేసు.. ఎక్సైజ్ పాలసీకి సంబంధించినది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దీని అమలుపై CBI విచారణకు సిఫారసు చేయగా.. వెంటనే ఆప్ ప్రభుత్వం 2022లో ఆ పాలసీని రద్దు చేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్‌ నేత మనీష్ సిసోడియాను జైల్లో పెట్టారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ నాయకురాలు, కేసీఆర్‌ కుమార్తె కవితకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. స్కామ్‌కు కేంద్ర బిందువుగా సౌత్‌లాబీని కవిత నడిపించారనే ప్రచారం జరిగింది. మొదట్లో ఈ కేసు విషయంలో మొత్తం 12 మంది వరకు సీబీఐ అరెస్ట్‌ చేసి విచారించింది. అందులో కవితకు సన్నిహితులైన బోయినపల్లి అభిషేక్‌, అరుణ్‌ రామచంద్ర పిళ్లై, శరత్‌ చంద్రారెడ్డి కూడా ఉన్నారు. కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబును కూడా అరెస్ట్‌ చేసింది సీబీఐ.

సిసోడియా అరెస్ట్‌ అయ్యాక నెక్ట్స్‌ కవితనే అరెస్ట్‌ అవుతారని.. తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ, కవిత కేవలం విచారణకే పరిమితం అయ్యారు. ఆమెను పలుమార్లు విచారించిన సీబీఐ అరెస్ట్‌ మాత్రం చేయలేదు. కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని.. సీబీఐ ఆరోపించింది. కానీ, కవిత తన పాత ఫోన్లను కూడా సీబీఐ సమర్పించి.. తాను నిజాయితీగానే ఉన్నానని, ఎలాంటి తప్పు చేయలేదంటూ గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈ కేసు నుంచి కవిత బయటపడినట్లే అని చాలా మంది భావించారు. కానీ, మళ్లీ ఇప్పుడు కవితను నిందితురాలిగా చేర్చడం సంచలనంగా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.