iDreamPost
android-app
ios-app

6 గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం: మంత్రి పొంగులేటి

Cabinet Sub Commttee For 6 Guarenties: కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలుపై యుద్ధ ప్రాతిపదికన మందుకెళుతోంది. తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.

Cabinet Sub Commttee For 6 Guarenties: కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలుపై యుద్ధ ప్రాతిపదికన మందుకెళుతోంది. తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.

6 గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం: మంత్రి పొంగులేటి

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 6 గ్యారెంటీల గురించే చర్చ నడుస్తోంది. 40 రోజుల్లో అమలు చేస్తామమని చెప్పిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయి అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ విమర్శలు, 6 గ్యారెంటీల అమలుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, 6 గ్యారెంటీల అమలుపై మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. ప్రజాపాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమీక్ష ముగిసిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎక్కడా 40 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయలేదు అంటూ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్లు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి. వాటివల్ల వారికి అధికారం కూడా దక్కింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 48 గంటల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేసి చూపించారు. అలాగే ఆరోగ్య శ్రీ పరిమితిని కూడా పెంచారు. అయితే మిగిలిన హామీల పరిస్థితి ఏంటి అంటూ ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది. 40 రోజుల్లో పూర్తి చేస్తామన్నారుగా అంటూ ప్రశ్నించింది. ఇలాంటి విమర్శలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. తాము ఎక్కడా 40 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పలేదన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పామంటూ గుర్తు చేశారు.

ప్రజా పాలన దరఖాస్తుల గురించి మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. “అభయహస్తం హామీలకు మొత్తం 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రతి గ్రామం నుంచి అభయహస్తం దరఖాస్తులను స్వీకరించాం. ఆపరేటర్లు దరఖాస్తుల వివరాలను ఎంట్రీ చేస్తున్నారు. 30 వేల మంది ఆరేటర్లతో శరవేగంగా డేటా ఎంట్రీ పనులు జరుగుతున్నాయి. జనవరి 25 కల్లా డేటా ఎంట్రీ పనులు పూర్తవుతాయి. నిజమైన లబ్ధిదారులను గుర్తించడమే మా లక్ష్యం. ఈ 6 గ్యారెంటీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీకి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. నేను, మంత్రి శ్రీధర్ బాబు కమిటీ సభ్యులుగా ఉంటాం. దరఖాస్తు చేసుకున్న వారిలో నిజమైన అర్హులకు కచ్చితంగా 6 గ్యారెంటీలు అందేలా చూస్తాం” అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

6 గ్యారెంటీల కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ.. హామీల అమలు, అసలైన లబ్ధిదారులను గుర్తించడంపై అధ్యయనం చేయనుంది. మరోవైపు ప్రతిపక్షంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కారు కూతలు కూస్తే సహించమంటూ వ్యాఖ్యానించారు. అసత్య ప్రచారాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ సహించబోదంటూ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షానివి దిగజారుడు రాజకీయాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి.. 6 గ్యారెంటీల అమలు కోసం కేబినెట్ కమిటీని ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.