iDreamPost
android-app
ios-app

వీడియో: MP చెంప చెల్లుమనిపించిన మహిళ.. ఎందుకంటే..?

పార్టీ బలోపేతానికి మీటింగ్ జరుగుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలు నిర్వహించే బాధ్యతలపై చర్చ నడుస్తుంది. అంతలో ఎంపీ అక్కడకు చేరుకోగా.. స్వాగతం పలికేందుకు వేదికను ఎక్కారు కార్యకర్తలు. అంతలో...

పార్టీ బలోపేతానికి మీటింగ్ జరుగుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలు నిర్వహించే బాధ్యతలపై చర్చ నడుస్తుంది. అంతలో ఎంపీ అక్కడకు చేరుకోగా.. స్వాగతం పలికేందుకు వేదికను ఎక్కారు కార్యకర్తలు. అంతలో...

వీడియో: MP చెంప చెల్లుమనిపించిన మహిళ.. ఎందుకంటే..?

అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు వస్తున్న సమయంలో ఫిరాయింపులే కాదు.. అసమ్మతి రాజ్యమేలుతూ ఉంటుంది. టికెట్టు ఆశించి భంగపడిన నేతలంతా నిరసన వ్యక్తం చేయడంతో మరో పార్టీలోకి జంప్ చేస్తుంటారు. పార్టీ కోసం, పార్టీ ఉన్నతి కోసం పాటుపడుతున్న తమను కాదని మరొకరికి పదవి ఇస్తే సహించలేరు. అందుకు కారకులైన వారిపై, అధిష్టానంపై తన విమర్శలు గుప్పిస్తుంటారు. అసంతృప్తి నేతలంతా ఒక్కొక్కరు ఒక్కోలా తన గళాన్ని వినిపిస్తుంటారు. అయితే తమ వ్యతిరేకతను చెప్పే క్రమంలో హద్దులు దాటేస్తున్నారు కొందరు. చిక్కుల్లో పడుతుంటారు. మహారాష్ట్రలో ఇప్పుడు ఇదే జరిగింది. బీఎస్పీ ఎంపీని ఓ మహిళ బహిరంగంగా చెంపపై కొట్టి తన నిరసన వ్యక్తం చేసింది. ఇంతకు ఏమైందంటే..?

ఈ ఏడాదిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్రంలో మళ్లీ పుంజుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. దీని నిమిత్తం రాష్ట్ర అధ్యక్షుడిగా సునీల్ డోంగ్రేను నియమించింది అధిష్టానం. ఆయన నియామకం తర్వాత తొలి రాష్ట్ర స్థాయి సమావేశం బుధవారం ముంబయిలో నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలు నిర్వహించే బాధ్యతలను గురించి చర్చించారు. ఈ కార్యక్రమానికి విచ్చేశారు బీఎస్పీ రాజ్య సభ ఎంపీ రామ్‌జీ గౌతమ్‌. ఆయనకు స్వాగం పలికేందుకు కార్యకర్తలు వేదిక వద్దకు విచ్చేశారు. భండారా జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు రామ్‌జీ స్వాగతం పలికేందుకు వేదికను ఎక్కగా.. వారిలో ఓ మహిళా కార్యకర్త  ఆయన చెంప చెల్లుమనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న నేత, ఇతర కార్యకర్తలు.. ఆమెను వేదిక మీద నుండి కిందకు దించేశారు.

ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించలేకపోయింది బీఎస్పీ. రాజ్య సభ ఎంపీని కొట్టిన మహిళ పేరు నీమా రింగరి మోహర్కర్ అని తెలుస్తుంది. నీమా విధాన పరిషత్ లోని నాగ్ పూర్ డివిజన్ ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీచేశారు. ఆమెకు ఆరు ఓట్లు పడ్డాయి. అంతకు ముందు జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. అయితే లోక్ సభ ఎన్నికల సమయంలో భండారా-గోండియా నియోజవకర్గం నుండి పోటీ చేసేందుకు ఆమె క్లెయిమ్ చేసుకోగా..రాష్ట్ర ఇన్‌చార్జి రామ్‌జీ గౌతమ్, అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు పరమేశ్వర్ గోవానే హామీ ఇచ్చినా ఆమెకు టికెట్ రాలేదు. దీంతో టికెట్ రాకపోవడానికి రామ్‌జీనే కారణమని భావించి.. ఇలా చెంప చెల్లుమనిపించింది. ఇదిలా ఉంటే… ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.. పార్టీ నుండి బహిష్కరించారు. ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని, డబ్బులు తీసుకుని అభ్యర్థులను నిర్ణయించారని నీమా మండిపడుతోంది. పార్టీ అధ్యక్షురాలు మాయావతిపై తనకు ఎలాంటి ఆగ్రహం లేదని పేర్కొన్నారు.