Swetha
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వారి పార్టీ పేరు మళ్ళీ.. బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి, దీనికి వెనుక గల కారణాలు ఏమై ఉంటాయి. ఈ వార్తలలో ఏ మేరకు నిజాలు దాగి ఉన్నాయి. అనే విషయాలను తెలుసుకుందాం.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వారి పార్టీ పేరు మళ్ళీ.. బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి, దీనికి వెనుక గల కారణాలు ఏమై ఉంటాయి. ఈ వార్తలలో ఏ మేరకు నిజాలు దాగి ఉన్నాయి. అనే విషయాలను తెలుసుకుందాం.
Swetha
2023 ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పేరుతో ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర పాలనను కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోడానికి గల కారణం.. కేవలం ఆ పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చడమే అని.. గులాబి పార్టీలో వార్తలు గుప్పుమంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీ గా మార్చడం ..తమ పార్టీలో 80శాతం మందికి ఇష్టం లేదని.. ఇటీవల జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల రివ్యూలో కూడా చాలా మంది నేతలు .. ఇదే మాట చెప్పారంటూ.. వినోద్ కుమార్ వెల్లడించారు.
రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. “భారత రాష్ట్ర సమితి ఈ పేరు అచ్చి రాలేదు. ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయాము. నాయకులు జైలు పాలయ్యారు. తెలంగాణ అనే పదాన్ని విడిచి కష్టాలను ఎదుర్కొంటున్నాం. వెనక్కు వెళ్తేనే బెటర్. కాదు వెనక్కు వెళ్లాల్సిందే. మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాలనే దానిపై న్యాయ సలహాలు తీసుకోవాల్సి ఉంది. మా పార్టీ కార్యకర్తలు తెలంగాణ పేరును పార్టీలో ఉండాలని కోరుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల అనంతరం చర్చించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాము.” అంటూ.. వినోద్ కుమార్ వెల్లడించారు. గతంలో కూడా ఓసారి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా.. బీఆర్ఎస్ పేరు అచ్చి రాలేదంటూ వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి అతి దగ్గరగా ఉండే.. వినోద్ కుమార్ ఈ వ్యాఖ్యలు చెప్పడంతో.. త్వరలోనే ఈ చేంజ్ వస్తుందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు విషయానికొస్తే.. 2001 ఏప్రిల్27న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా.. జలదృశ్య వేదికపై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు అయింది. ఆ తర్వాత అదే సంవత్సరం మే 17న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభ.. ఎన్నో రాజకీయ మార్పులకు వేదికైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో మంది అగ్ర నేతలు ఈ పార్టీలో .. తమ వంతు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో.. అక్టోబర్ 5, 2022 న తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా మారింది. ఇక ఆ తర్వాత 2023లో జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. దీనితో అందరూ యూ.. ఈ పార్టీకి బీఆర్ఎస్ పేరు కలిసి రాలేందటూ .. చర్చించుకుంటున్నారు. దీనితో పార్టీ అధికారులు బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఇది ఎటువంటి చర్చలకు దారి తీస్తుందో వేచి చూడాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.