iDreamPost
android-app
ios-app

పోలింగ్ ముగిసినా రాని ఎగ్జిట్ పోల్స్.. ఎందుకు రాలేదంటే?

Andhra Pradesh- Telangana Exit Polls: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ- పార్లమెంట్, తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. అయితే ఎన్నికలు ముగిసినా కూడా ఎగ్జిట్ పోల్స్ రాలేదు. ఎందుకు అలా జరిగిందో ఆలోచించారా?

Andhra Pradesh- Telangana Exit Polls: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ- పార్లమెంట్, తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. అయితే ఎన్నికలు ముగిసినా కూడా ఎగ్జిట్ పోల్స్ రాలేదు. ఎందుకు అలా జరిగిందో ఆలోచించారా?

పోలింగ్ ముగిసినా రాని ఎగ్జిట్ పోల్స్.. ఎందుకు రాలేదంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగాయి. తెలంగాణలో మాత్రం లోక్ సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా అవాంఛనీయ సంఘటనలు మినహా దాదాపుగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణలో పోలింగ్ శాతం కూడా పెరిగినట్లు అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా యువత, వృద్ధులు, వికలాంగులు అంతా రెట్టించిన ఉత్సాహంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ హడావుడి ఉంటుంది. కానీ, ఈసారి అలా ఎందుకు జరగలేదు అనే ప్రశ్న వేసుకున్నారా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత అన్ని ఛానల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ లో ఎగ్జిట్ పోల్స్ హడావుడి ఉంటుంది. అంటే ఎన్నికల్లో ఎవరి విజయం ఉంటుంది? ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అనే విషయాలపై పలు మీడియా హౌస్లు, ప్రైవేటు వ్యక్తులు చేసిన సర్వేల ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ని విడుదల చేస్తూ ఉంటారు. అవి కేవలం అంచనాలు మాత్రమే. అయితే ఈసారి ఆ అంచనాలు కూడా రాలేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ పై తెలంగాణలో ఎన్నికల అధికారులు నిషేధం విధించిన విషయం తెలిసిందే. జూన్ 1 సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించారు. అలాగే ఏపీలో కూడా ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించారు.

నిషేధం ఎందుకు?:

ఈసారి ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించారు. అందుకు కారణం లేకపోలేదు. సాధారణంగా ఎప్పుడూ విడతల వారీగా ఎన్నికలు జరుగుతాయి. ఈసారి కూడా 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.   మే 13న జరిగింది నాలుగో విడత ఎన్నికలు. మే 13తో మొత్తం నాలుగు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా మూడు విడతల ఎన్నికలు జరగాల్సి ఉంది. మొదటి విడత ఏప్రిల్ 19న 21 రాష్ట్రాల్లో జరిగాయి. రెండో దశలో భాగంగా ఏప్రిల్ 26న 13 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. మే 7న మూడో దశలో భాగంగా 12 రాష్ట్రాల్లో మే 13న నాలుగో దశలో భాగంగా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.

మే 20న ఐదో దశ, జూన్ 1న ఏడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న జరిగే విడతతో దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగుస్తాయి. అప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయకూడదు అని ఎన్నికల అధికారులు నిషేధం విధించారు. జూన్ 1న సాయంత్రం 6.30 గంటల తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ని విడుదల చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. మరి.. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.