Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది.సచివాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించారు. పలు అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే మంత్రులు అందరూ రాజీనామా చేశారు. వారి వారి లెటర్ హెడ్‌లో రాజీనామాలు చేసిన మంత్రులు వాటిని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అందజేశారు.
ఈ నెల 11వ తేదీన నూతన కేబినెట్ కొలువుతీరబోతోంది. అందుకు అనుగుణంగా ఈ రోజు మంత్రులు అందరూ రాజీనామా చేశారు. 11వ తేదీన ఉదయం 11:05 గంటలకు సచివాలయం ప్రాంగణంలో నూతన మంత్రులు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంపై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెలియజేశారు. త్వరలోనే నూతన మంత్రుల జాబితాను సీఎం వైఎస్ జగన్ ఫైనల్ చేయనున్నారు. అనంతరం ఆ జాబితాను గవర్నర్‌కు పంపబోతున్నారు.
కేబినెట్ నిర్ణయాలు ఇవీ..
– మిల్లెట్ పాలసీకి ఆమోదం
– డిగ్రీ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగంలో 574 పోస్టులకు ఆమోదం
– పంచాయతీరాజ్ చట్టం సవరణ ఆర్డినెన్స్‌కు గ్రీన్‌సిగ్నల్
– ఏపీ టూరిజం కార్పొరేషన్‌కు ఆరు ఎకరాల కేటాయింపుకు అనుమతి
– రాజమహేంద్రవరంలో హోటల్ కం కన్వెన్షన్ సెంటర్‌కు స్థల ప్రతిపాదన
– ఐదు జిల్లాల్లో అస్పత్రుల నిర్మాణానికి భూ కేటాయింపులకు ప్రతిపాదనకు ఆమోదం
– కొలిమిగుండ్లలో 82 ఎకరాల్లో పారిశ్రామిక పార్కుకు కేబినెట్ ఆమోదం
– పులివెందుల, కొత్తపేట రెవిన్యూ డివిజన్లకు ఆమోదం
– జెడ్పీల కాలపరిమితి ముగిసేవరకూ కొనసాగించేందుకు చట్టసవరణకు నిర్ణయం
– జగ్గంపేటలో బస్‌స్టాండ్ నిర్మాణానికి స్థలం కేటాయింపు