iDreamPost
android-app
ios-app

బ్రో సినిమాపై అంబటి రియాక్షన్‌.. ఓడినోడి డ్యాన్స్‌ కాళరాత్రి అంటూ!

  • Published Jul 29, 2023 | 1:04 PM Updated Updated Jul 29, 2023 | 1:04 PM
  • Published Jul 29, 2023 | 1:04 PMUpdated Jul 29, 2023 | 1:04 PM
బ్రో సినిమాపై అంబటి రియాక్షన్‌..  ఓడినోడి డ్యాన్స్‌ కాళరాత్రి అంటూ!

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ నటించిన బ్రో సినిమాపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. పవన్‌ కళ్యాణ్‌ చేసేది కాళరాత్రి డ్యాన్స్‌ అంటూ బ్రో సినిమాపై సెటైరికల్‌ ట్వీట్‌ చేశాడు మంత్రి అంబటి. ఇంతకు ఏం జరిగింది అంటే.. ఈ మధ్య కాలంలో పవన్‌ కళ్యాణ్‌.. తన సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా సరే.. పొలిటికల్‌ డైలాగ్‌లు ప్రత్యేకించి చేర్చుతోన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ నటించి బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుని టార్గెట్‌ చేస్తూ.. సెటైర్లు వేశాడు పవన్‌ కళ్యాణ్‌. ఈ మేరకు సి నిమాలో చేసిన పేరడీ సీన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు అది ఏం సీన్‌ అంటే..

బ్రో చిత్రంలో అంబటిని ఇమిటేట్‌ చేస్తూ.. ఓ పేరడీ సీన్‌ తీశారు. ఈ ఏడాది సంక్రాతి సందర్భంగా తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు అంబటి రాంబాబు. ఈ కార్యక్రమంలో ఆయన హుషారుగా చిందులు వేస్తూ.. డ్యాన్స్‌ చేశారు. జనాలను ఉత్సాహపరిచారు. అంబటి డ్యాన్స్‌ వీడియో అప్పట్లో తెగ వైరల్‌ అయ్యింది. అయితే దీన్ని పవన్‌ కళ్యాణ్‌ తన బ్రో సినిమాలో పేరడీ పేరిటి చూపించాడు. ఈ సీన్‌లో పవన్‌ కళ్యాణ్‌తో పాటు.. లైంగిక వేధింపులతో టీటీడీ పదవి పొగొట్టుకుని.. మెగా కాంపౌండ్‌ చేసిన నటుడు థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ కలిసి నటించారు.

బ్రో సినిమాలో ఈ సన్నివేశంలో పృథ్వీరాజ్‌ను శ్యాంబాబు పేరిట చిత్రీకరించారు. అంబటి డ్యాన్స్‌ను ఎగతాళి చేస్తూ డైలాగ్స్‌ చెప్పారు. ఈ సీన్‌పై రాజకీయ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. చాలా మంది పవన్‌ తీరును తప్పు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బ్రో చిత్రంలోని పేరడీపై స్పందిస్తూ.. పవన్‌కు చురకలు అంటించారు అంబటి. గెలిచినోడు సంక్రాంతి డ్యాన్స్‌ చేస్తే.. ఓడిన వాడు చేసేది కాళరాత్రి అంటూ పవన్‌ కళ్యాణ్‌ని టార్గెట్‌ చేస్తూ.. దిమ్మ తిరిగే రేంజ్‌లో కౌంటర్‌ ఇచ్చారు అంబిటి రాంబాబు. ఇక పవన్‌ తన సిననిమాల్లో ఇతర హీరోలు, నాయకుల మీద సటైర్లు వేయడం కొత్త కాదు. గతంలో పవన్‌ నటించని గబ్బర్‌ సింగ్‌ చిత్రంలో కూడా హీరో రాజశఖర్‌ను అనుకరిస్తూ.. ఓ చిన్న వర్షన్‌ చేయడం సంచలనం సృష్టించింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet