iDreamPost
android-app
ios-app

YS Jagan: ఒక్క రూపాయి ఆస్తి లేని కార్యకర్తకి MLA సీటు! ఇది జగన్ కి మాత్రమే సాధ్యం!

  • Published Jan 20, 2024 | 10:02 AM Updated Updated Jan 20, 2024 | 10:02 AM

రాజకీయాల్లో సామాజిక విప్లవం తీసుకొచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పుడు అతి సాధారణ కుటుంబాలను గుర్తించి వారికి టికెట్లు ఇచ్చి సంచలనం సృష్టించారు. ఆ వివరాలు..

రాజకీయాల్లో సామాజిక విప్లవం తీసుకొచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పుడు అతి సాధారణ కుటుంబాలను గుర్తించి వారికి టికెట్లు ఇచ్చి సంచలనం సృష్టించారు. ఆ వివరాలు..

  • Published Jan 20, 2024 | 10:02 AMUpdated Jan 20, 2024 | 10:02 AM
YS Jagan: ఒక్క రూపాయి ఆస్తి లేని కార్యకర్తకి MLA సీటు! ఇది జగన్ కి మాత్రమే సాధ్యం!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో సమూల మార్పులకు శ్రీకారం చూట్టారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల వారు అన్ని రకాలుగా అభివృద్ది చెందితేనే రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందని భావించారు. అందుకు తగ్గట్టుగానే నవ రత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. అలానే తన కేబినెట్‌లో బడుగు, బలహీన వర్గాల వారికి పెద్ద పీఠ వేశారు. అలానే పదవుల కేటాయింపుల్లో కూడా ఇదే లెక్క పాటించారు. ఇక తాజాగా నియమిస్తున్న ఇంచార్జ్‌ల విషయంలో కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు ముఖ్యమంత్రి జగన్‌. తాజాగా ఓ సామాన్య కార్యకర్తకు ఏకంగా ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి.. మరోసారి పేదల పెన్నిధిగా నిరూపించుకున్నారు జగన్‌. ఆ వివరాలు..

నేటి కాలంలో సర్పంచ్‌ టికెట్‌ ఇవ్వాలన్నా.. వారి ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీసి.. భారీగా ఖర్చు చేయగల్గుతారా లేదా అన్నది పరిశీలించి.. ఆ తర్వాతే టికెట్‌ ఇస్తారు. అలాంటిది ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలంటే.. ఇక ఆ అభ్యర్థికి ఎంత ఆస్తి ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది మిగతా నాయకులు ఆలోచన తీరు. కానీ ఏపీ సీఎం జగన్‌ దారే సెపరేటు. అందుకే రాజకీయాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సరికొత్త నిర్ణయాలతో నవ శకానికి నాంది పలుకుతోంది. దీనిలో భాగంగా.. ఏకంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారిని గుర్తించి నియమించారు వైఎస్‌ జగన్‌.

MLA seat for common worker!

ఇప్పటికే రాజకీయాల్లో సామాజిక విప్లవం తీసుకొచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పుడు అతి సాధారణ కుటుంబాలను గుర్తించి అందలమెక్కించడం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. గురువారం రాత్రి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ నాల్గో విడత జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిలో ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి అవకాశం కల్పించారు జగన్‌. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి శింగనమల, మడకశిర రిజర్వ్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈక్రమంలో మడకశిర నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈర లక్కప్పను నియమించగా.. శింగనమల ఇన్‌చార్జ్‌గా అత్యంత సాధారణ కుటుంబానికి చెందిన ఎం.వీరాంజనేయులును నియమించారు సీఎం జగన్‌.

ఈ సందర్భంగా లక్కప్ప, వీరాజంనేయులు మాట్లాడుతూ.. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా తమకు అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాయకులు, పెద్దలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెబుతున్నారు. తమకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. సామాన్యులకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

మాజీ సర్పంచ్‌ ఈర లక్కప్ప

ఈర లక్కప్పది గుడిబండ మండలం పలారం. ఆయన తండ్రి సామాన్య రైతు. కొంతకాలం క్రితం మృతి చెందారు. ఈర లక్కప్ప 1989 నుంచి 99 వరకు ఓ స్వచ్ఛంద సంస్థలో టీచరుగా పని చేశారు. 2006–2011 వరకు గుడిబండ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందించారు. 2015–2019 వరకు వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ మండల కన్వీనర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అలాంటి ఓ సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వగల మంచి మనసు కేవలం సీఎం జగన్‌కు మాత్రమే ఉంది అంటున్నారు.