iDreamPost
android-app
ios-app

చంద్రబాబు సీటు మీద నిలబడ్డ బాలయ్య.. అంబటి సెటైర్లు

  • Published Sep 22, 2023 | 10:31 AM Updated Updated Sep 22, 2023 | 10:31 AM
  • Published Sep 22, 2023 | 10:31 AMUpdated Sep 22, 2023 | 10:31 AM
చంద్రబాబు సీటు మీద నిలబడ్డ బాలయ్య.. అంబటి సెటైర్లు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం అయినప్పటి నుంచే టీడీపీ సభ్యులు.. నానా బీభత్సం సృష్టించారు. స్కిల్‌ డెవలప్‌ స్కామ్‌, చంద్రబాబు అరెస్ట్‌ మీద చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. అధికారపక్షం అందుకు అంగీకరించినప్పటికి.. టీడీపీ సభ్యులు మాత్రం ఊరుకోలేదు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి.. కాగితాలు విసుర్తూ.. రచ్చ రచ్చ చేశారు. ఇక హిందూపూర్‌ టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య.. నేడు మళ్లీ సీన్‌ క్రియేట్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు సభలో మీసం మెలేసిన బాలయ్య.. నేడు ఏకంగా విజిల్‌ ఊదుతూ.. అసెంబ్లీ గౌరవాన్ని తగ్గించే చర్యలకు పాల్పడ్డారు.

బాలయ్య.. అసెంబ్లీలో ఏకంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కేటాయించిన సీటు మీద నిలబడి.. విజిల్‌ ఊదుతూ.. రెచ్చిపోయారు. బాలయ్య చర్యలపై మంత్రి అంబటి సెటైర్లు వేశారు. బాలయ్య.. చంద్రబాబు సీటు మీద నిలబడటం గమనించిన అంబటి.. ‘‘బాలకృష్ణ నిల్చున్న సీటు.. చంద్రబాబు నాయుడిది. అయ్యా ఆ సీటులో నిల్చోవడం కాదు.. కూర్చోవయ్య అంటే.. కూర్చోడేంటి. నాడు చంద్రబాబు.. ఎన్టీఆర్‌ని గద్దె దించి.. తాను అధికారంలోకి వచ్చినప్పడు.. బాలయ్య మీద అపవాదులు వచ్చాయి. తండ్రికి వెన్నుపోటు పొడిచిన బావకు.. బాలయ్య మద్దతిచ్చాడని విమర్శలు వచ్చాయి’’ అని గుర్తు చేశారు.

‘‘ఇప్పటికైనా ఆ సీటులో కూర్చొనే అవకాశం వచ్చింది.. కూర్చోవయ్యా.. ఆ సీటును అతుక్కో.. సీటులో నిల్చోవడం కాదు.. వెళ్లి చంద్రబాబు మీద నిల్చో..’’ అంటూ బాలయ్యపై సెటైర్లు వేశారు అంబటి. అంతేకాక చర్చలో పాల్గొంటే.. చంద్రబాబు అవినీతి బట్టబయలు అవుతుంది అని టీడీపీ వారికి తెలుసు.. అందుకే సభను తప్పుదోవ పట్టించడం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు. ఇక బాలయ్య ఇంటికి వెళ్లి విజిల్స్‌ వేసుకోవాల్సిందే అని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş