iDreamPost
android-app
ios-app

బస్సుయాత్రతో జనంలోకి జగన్.. ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారు..

YS Jagan Bus Yatra: ఏపీ ఎన్నికల నేపథ్యంలో అధికార వైఎస్సార్ సీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యచరణ రూపొందించింది. వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈసారి బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.

YS Jagan Bus Yatra: ఏపీ ఎన్నికల నేపథ్యంలో అధికార వైఎస్సార్ సీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యచరణ రూపొందించింది. వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈసారి బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.

బస్సుయాత్రతో జనంలోకి జగన్.. ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల జోరు తారస్థాయికి చేరుకుంటోంది. అధికార వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారాలు, వ్యూహాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ జనంలోకి వెళ్లేందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఎలా ప్రజల్లోకి వెళ్తారు? ఈసారి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రజలతో ఏ విధంగా మమేకమవుతారు అంటూ కార్యకర్తల్లో నెలకొన్ని ఎన్నో సందేహాలకు సమాధానాలు వెల్లడయ్యాయి. మార్చి 27 నుంచి జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈసారి బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇప్పటివరకు చేసిన సంక్షేమం, ఇకపై ప్రజలకు అందించబోయే పాలనకు సంబంధించి నేరుగా వైఎస్ జగన్ ప్రజలకు వివరించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. మే 13న ఏపీలో ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజల్లోకి వెళ్లేందుకు, వారిత మమేకమయ్యేందుకు అధికార వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వైఎస్ జగన్ ప్రజలతో మమేకమయ్యేందుకు ముహూర్తం ఖరారు చేశారు. మార్చి 27 నుంచి వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈసారి బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నిర్వహించనున్నారు.

The time for the election campaign has been finalized 1

బస్సు యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు, షెడ్యూల్, ఏ రోజు ఏ నియోజకవర్గంలో ఉంటారు అనే విషయాలను రేపు అధికారికంగా విడుదల చేయనున్నారు. బస్సుయాత్రకు సంబంధించిన వివరాలను వైసీపీ నేతలు వెల్లడించారు. ఈసారి ప్రచారం పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలో ఉంటుందని చెప్పారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఉంటుంది. నియోజకవర్గంలో బస్సు యాత్ర సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం ఒక బహిరంగ సభ ఉంటుంది. అలాగే ఒక ఇంటరాక్షన్ కూడా ఉంటుందని వెల్లడించారు. ఈ బహిరంగ సభలో స్థానిక నేతలు పాల్గొంటారు. అంటే లోక్ సభ అభ్యర్థి, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన నేతలు బహిరంగ సభలో పాల్గొంటారు.

ఒకసారి బస్సుయాత్ర ప్రారంభమయ్యాక వైఎస్ జగన్ 21 రోజలపాటు ప్రజల్లోనే ఉండబోతున్నారు. రాత్రి బస కూడా యాత్రకు అనుగుణంగా ఉండబోతోంది. పూర్తి షెడ్యూల్ ని రేపు విడుదల చేయబోతున్నారు. ఈ బస్సుయాత్రలో ఇప్పటివరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమం గురించి వివరించనున్నారు. అలాగే భవిష్యత్ కార్యచరణ, ఈసారి విజయం సాధించాక చేయబోయే కార్యక్రమాల గురించి స్వయంగా వైఎస్ జగన్ ప్రజలకు వివరించనున్నారు. ఈసారి వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించాలని నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అందుకు తగినట్లు ప్రజల్లోకి వెళ్లాలి అంటూ పిలుపునిచ్చారు.