iDreamPost
android-app
ios-app

పవన్ కామెంట్స్ పై అంబటి సీరియస్.. వాళ్లే దండుపాళ్యం బ్యాచ్!

  • Published Aug 13, 2023 | 5:08 PM Updated Updated Aug 13, 2023 | 5:08 PM
  • Published Aug 13, 2023 | 5:08 PMUpdated Aug 13, 2023 | 5:08 PM
పవన్ కామెంట్స్ పై అంబటి సీరియస్.. వాళ్లే దండుపాళ్యం బ్యాచ్!

తెలుగుదేశం పార్టీ, జనసేన పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎల్లో మీడియా కావాలనే పిచ్చి పిచ్చి రాతలు రాస్తోందంటూ విమర్శించారు. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన ప్రారంభించిన తర్వాతే రాష్ట్రంలో వర్షాలు కురవడం లేదంటూ దుయ్యబట్టారు. దండుపాళ్యం బ్యాచ్ అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. అసలు దండుపాళ్యం బ్యాచ్ అంటే మీరే అంటూ ఎద్దేవా చేశారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తారనే అక్కుసుతోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారన్నారు.

“దత్తపుత్రుడు వారాహి మీద ఎక్కి శ్రుతిమించి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తాడనే విషయం తెలిసి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త తెలిసి ఎల్లో మీడియా కూడా పెద్ద పెద్ద వార్తలు రాస్తున్నారు. పట్టిసీమ గానీ, పోలవరం గానీ ఎవరి డబ్బులతో కట్టారు? ఏదో చంద్రబాబు గారి ఇంట్లో డబ్బులతో కట్టినట్లు చెబుతున్నారు. చంద్రబాబు కోసం మద్దతు ఇవ్వడం కోసం తాపత్రయం పడుతుంటే నాకు జాలేస్తోంది. ఇవాళ తెదేపా అతలాకుతలం అయిపోతుంటే అనేకమైన కథనాలు ఫ్రంట్ పేజ్ లో రాస్తు విలువ చెడగొట్టుకుంటున్నారు. పట్టిసీమను ఉపయోగించుకుంటే తప్పేంటి?

పట్టిసీమ మొత్తం నిర్మాణానికి రూ.1400 కోట్లు వెచ్చించే కార్యక్రమం చేశారు. పట్టిసీమకు మెఘా ఇంజినీరింగ్ వారికి రూ.1394 కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఏడాదికే పూర్తి చేస్తే 22 శాతం ఇన్సెన్టివ్ ఇస్తాం అన్నారు. పనులు ఇంకా ఉన్నా రిబ్బన్ కట్ చేసి రూ.257 కోట్లు ఇచ్చారు. ఇది మొత్తం డబ్బులు మింగేయడం కోసమే చేసిన స్కామ్. పట్టిసీమ ఎవడి బాబు సొత్తు కాదు. ప్రజల సొమ్ముతో కట్టినది. రూ.వందల కోట్లు కాజేయడానికే కట్టారు. దండుపాళ్యం బ్యాచ్ అంటున్నారు. ఎవరు దండుపాళ్యం? వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్ అంట. నిజంచెప్పాలంటే దండుపాళ్యం బ్యాచ్ ఎవరంటే.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ వంటి వాళ్లు దండుపాళ్యం బ్యాచ్.

ఈ రాష్ట్రంలో జగన్ ను అధికారం నుంచి దించేసి.. రాష్ట్రాన్ని దోచుకోవాలి అని చూస్తున్నదే దండుపాళ్యం బ్యాచ్. ఎక్కడ దొరికితే అక్కడ తినేద్దాం అని ముందుకు వెళ్తున్నది చంద్రబాబు అండే దండుపాళ్యం బ్యాచ్. ముసలమ్మను చంపిన వెంకటేశ్ ను వాలంటీర్ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపేశారు. చనిపోయిన ఆమె కుమారుడి వద్ద వెంకటేశ్ చేరాడు. వారికి వారికి ఏం గొడవలు జరిగాయో అతను హత్య చేశాడు. అప్పుడు ఉమెన్ ట్రాఫెకింగ్ అన్నావ్.. ఇప్పుడు దండుపాళ్యం బ్యాచ్ అంటున్నావ్. జనసేన అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తారు. అయితే ముందు రావాలిగా. నువ్వు అధికారంలోకి రావడానికి కావాల్సిన సీట్లు తీసుకుంటావా? చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడానికే కృషి చేస్తున్నావ్. 175 సీట్లలో ఎన్ని సీట్లు తీసుకుంటావ్. 25 సీట్లకే నువ్వు సీఎం అయిపోతావా? కక్షతోనూ.. క్యాష్ తోనూ ఆయనకు కళ్లు పొరలు కమ్మాయి. జనసేన కార్యకర్తలను పవన్ కల్యాణ్ ముంచేస్తారు” అంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş