Harirama Jogaiah: ఇంకా యాచించే స్థితేనా? పవన్‌కు హరిరామజోగయ్య ప్రశ్న!

సీఎం కుర్చి షేరింగ్ కాదు.. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. దీనికి పవన్ సమాధానం ఏంటో చెప్పాలంటూ హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఆ వివరాలు..

సీఎం కుర్చి షేరింగ్ కాదు.. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. దీనికి పవన్ సమాధానం ఏంటో చెప్పాలంటూ హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఆ వివరాలు..

టీడీపీ-జనసేన కూటమి విజయం సాధిస్తే.. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి.. సీఎం కుర్చి షేరింగ్ ప్రసక్తే లేదు.. పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు మద్దతిచ్చారు అంటూ తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అంటే పవన్ తనకు ఎమ్మెల్యే సీటు చాలని భావిస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు, కార్యకర్తలు. ఈ క్రమంలో తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలని ప్రస్తావిస్తూ.. దీనికి మీ సమాధానం ఏంటి పవన్ కళ్యాణ్ అంటూ మాజీ పార్లమెంటేరియన్‌, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామజోగయ్య ప్రశ్నించారు.

అంతేకాక జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. పవన్.. యాచించే స్థితిలో ఉండాలని జనసైనికులు కోరుకోవట్లేదని.. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో జనసేన అధ్యక్షుడి వైఖరి ఏంటో స్పష్టం చేయాలంటూ లేఖ ద్వారా చురకలంటించారు హరిరామజోగయ్య. ప్రస్తుతం ఈ లేఖ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

టీడీపీ నేత నారా లోకేష్‌ సీఎం పదవి గురించి చేసిన వ్యాఖ్యాల నేపథ్యంలో.. హరిరామ జోగయ్య.. లేఖ ద్వారా పవన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయకత్వాన్ని పవన్‌ నిజంగా సమర్థిస్తున్నాడా.. ఒకవేళ అదే నిజమైతే.. బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటని పవన్ కళ్యాణ్ ని లేఖలో నిలదీశారు హరిరామజోగయ్య. అంతేకాక ఏపీ జనాభాలో 80 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఇంకెప్పుడు అని లేఖలో పవన్ ని ప్రశ్నించారు.

చంద్రబాబునే పూర్తి కాలం సీఎంగా చేయడానికి మీరు ఆమోదం తెలుపుతున్నారా.. మరి మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీనవర్గాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలి అని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. రాజ్యాధికారాన్ని చేబట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జనసైనికులుందరికి అర్థమయ్యేలా చెప్పాల్సిందిగా పవన్ ని కోరారు హరిరామ జోగయ్య.

ఇదిలా ఉంటే.. రాష్ట్రానికి అనుభవస్తుడి నాయకత్వమే కావాలంటూ పవన్‌ కల్యాణ్‌ అనేకసార్లు ప్రస్తావించిన మాటను కూడా లేఖలో పేర్కొన్నారు హరిరామజోగయ్య. అధికారం చేపట్టి.. బలహీనవర్గాలను శాసించే స్థితికి మీరు(పవన్‌) తెస్తారని జనసైనికులు కలలు కంటున్నారు. ఆ కలలు ఏం కావాలని కోరుకుంటున్నారో పవన్‌ చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యాధికారాన్ని చేబట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జనసైనికులుకు స్పష్టం చేయమని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు సీఎం పదవి గురించి లోకేష్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. కష్టపడి అధికారం తెచ్చి టీడీపీ వాళ్లకు కట్టబెట్టాలా.. దీని కన్నా ఒంటరిగా బరిలో దిగితే.. కనీసం గౌరవం అన్నా ఉంటుంది కదా అని అంటున్నారు. మరి లోకేష్ వ్యాఖ్యలపై పవన్, జనసేన కీలక నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Show comments