iDreamPost
iDreamPost
యుద్ధం జరగదనే నమ్మకంతో ఉన్న ఉక్రెయిన్‌కు ఈ రోజు ఉదయం రష్యా షాక్ ఇచ్చింది. యుద్ధం ప్రకటించింది. ఆ షాక్ నుంచి ఉక్రెయిన్ ఇంకా తేరుకోలేదు. యుద్ధం మొదలై నాలుగు గంటల కావస్తున్నా.. ప్రతిదాడిని ఉక్రెయిన్ మొదలు పెట్టలేదు. కానీ రష్యా మాత్రం యుద్ధానికి పక్కాగా సిద్ధమైంది. అందుకే మొదలు పెట్టిన నాలుగు గంటల్లోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి. ముందుగా విమానాశ్రయాన్ని ఆదీనంలోకి తీసుకున్న రష్యా.. ఆ వెంటనే రాజధాని హస్తగతం చేసుకుంది.
రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు, ప్రాంతాలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 13 చోట్ల 300 మంది పౌరులు మరణించారు. రష్యాకు మద్ధతుగా మరో చిన్న దేశాలు కూడా ముందుకు వచ్చాయి. రష్యాతో అన్ని రకాలుగా మంచి సంబంధాలు కలిగి ఉన్న చిన్న దేశాలైన క్రిమియా, బెలారస్‌లు యుద్ధంలో పాల్గొంటున్నాయి.
తాజా పరిణామాలపై మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌క్కి కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో జెలెన్‌స్కి నిస్సహాయత కనిపిస్తోంది. రష్యా పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించిందని జెలెన్‌స్కి పేర్నొS్నరు. ఇది దురాక్రమణ అంటూ మండిపడ్డారు. శాంతియుత నగరాలపై కూడా రష్యా దాడులు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు పుతిన్‌ను నిలువరించాలని అభ్యర్థించారు. యుద్ధం ఆపడం ఐక్యరాజ్యసమితి బాధ్యత అంటూ జెలెన్‌స్కి వ్యాఖ్యానించారు.
తాము ముందు దౌత్యపరంగానే ముందుకు వెళతామని జెలెన్‌స్కి పేర్కొన్నారు. ఆ తర్వాతనే ప్రతిదాడి చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా బలగాలను మోహరిస్తున్నామని తెలిపారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు బంకర్లలోకి వెళ్లాలని సూచించారు. రాజధాని కీవ్‌లోని బంకర్లు అన్నీ నిండిపోయాయని చెప్పారు. ఇక స్థలం లేదని చెప్పారు. ప్రాణాలు కాపాడుకునేందుకు రాజధానిలో ఉన్న ప్రజలు వెళ్లిపోతున్నారు.
ఉక్రెయిన్ బలగాలు లొంగిపోవాలని ఇప్పటికే పుతిన్ ప్రకటించారు. ఆయుధాలు వదిలివేయాలని, సైనిక సిబిరాలను వదిలి వెళ్లాలని పిలుపునిచ్చారు. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరే ప్రయత్నాలను రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నాటోలో చేరితే అది తమ దేశ భద్రతకు పెను ముప్పుగా పరిగణిస్తుందన్న ఆందోళనతోనే.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను చేపట్టింది. కాగా. ఉక్రెయిన్‌కు మద్ధతుగా నాటో దళాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. యుద్ధం భీకరంగా ఉంటుంది. దాని నష్టం ఊహకందని విధంగా ఉంటుంది.