iDreamPost
android-app
ios-app

OTTలోకి వరుణ్-లావణ్య పెళ్లి వేడుక! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Author Soma Sekhar Published - 09:49 PM, Mon - 6 November 23

వరుణ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకను ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

వరుణ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకను ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Author Soma Sekhar Published - 09:49 PM, Mon - 6 November 23
OTTలోకి వరుణ్-లావణ్య పెళ్లి వేడుక! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లి అంగరంగ వైభవంగా ఇటలీలో జరగగా.. రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. వీరి పెళ్లికి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరైయ్యారు. తాజాగా జరిగిన రిసెప్షన్ కు కూడా పెద్ద ఎత్తున సెలబ్రిటీలు హాజరైయ్యారు. ఇదిలా ఉండగా.. వరుణ్-లావణ్య పెళ్లి వేడుకను ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

మెగావారసుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు మెగాస్టార్ దంపతులతో పాటుగా, రామ్ చరణ్ దంపతులు, అల్లు అర్జున్ ఫ్యామిలీ, నితిన్ ఫ్యామిలీ అటెండ్ అయ్యారు. కాగా.. కాక్ టెయిల్ పార్టీతో మెుదలై.. హల్దీ, సంగీత్ వేడుకలు అంటూ ప్రతీ విషయాన్ని ఘనంగా జరిపారు మెగా ఫ్యామిలీ. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ వేడుకను జరిపారు. ఇక వీరి పెళ్లికి సంబంధించి మెగా అభిమానుల కోసం వరుణ్ తేజ్ ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వరుణ్ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోను ప్రముఖ ఓటీటీలో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఈవెంట్ ను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రసారం చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన వీడియో హక్కులను నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 8 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదే గనక నిజమైతే.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవ్వడం ఖాయం. కాగా.. గతంలో స్టార్ హీరోయిన్ హన్సిక, నయనతార తమ పెళ్లి వీడియోను ఇలా ఓటీటీ వేదికగా రిలీజ్ చేసిన విషయం మనందరికి తెలిసిందే.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş