iDreamPost
android-app
ios-app

ది కేరళ స్టోరీ.. ఇన్నాళ్లకు అఫీషియల్ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!

The Kerala Story Official OTT Release Date: దేశాన్ని ఒక ఊపుఊపేసిన ది కేరళ స్టోరీ ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతోంది. దాదాపు 100 నెలలుగా ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

The Kerala Story Official OTT Release Date: దేశాన్ని ఒక ఊపుఊపేసిన ది కేరళ స్టోరీ ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతోంది. దాదాపు 100 నెలలుగా ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ది కేరళ స్టోరీ.. ఇన్నాళ్లకు అఫీషియల్ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!

కొన్ని సినిమాలు థియేటర్లలో సత్తా చాటుతాయి. మరికొన్ని సినిమాలు ఓటీటీల్లో దూసుకెళ్తాయి. కానీ, ఇంకొన్ని చిత్రాలు మాత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపించినా కూడా ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అంటూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటి లిస్ట్ లోకి ది కేరళ స్టోరీ కూడా వస్తుంది. ఈ మూవీ థియేటర్లలో సృష్టించిన కలెక్షన్స్ సునామీ అంతా ఇంతా కాదు. కానీ, ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ప్రేక్షకులను మరింత నిరాశకు గురి చేస్తూ.. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.

ది కేరళ స్టోరీ మూవీ దేశవ్యాప్తంగా క్రియేట్ చేసిం ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఈ సనిమాని ప్రశంసించిన వాళ్లు ఉన్నారు, విమర్శించిన వాళ్లు ఉన్నారు. థియేటర్లలో ప్రదర్శించకూడదు అంటూ బ్యాన్ చేయాలని డిమాండ్ చేసినవాళ్లు కూడా ఉన్నారు. అయితే అన్ని అవరోధాలను దాటుకుని ఈ మూవీ 2023 మే5న థియేటర్లలో విడుదల అయ్యింది. మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపించింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ తో అందరినీ అబ్బురపరిచింది. థియేటర్లలో స్ట్రాంగ్ మౌత్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందా అని సినిమా లవర్స్ అంతా ఎదురుచూశారు.

ఈ సినిమా ఎన్నిసార్లు ఓటీటీ రిలీజ్ అవుతోంది అని చెప్పినా కూడా అది రిలీజ్ కాలేదు. దాదాపు 10 నెలలు కావొస్తోంది. ఇప్పటికీ ఓటీటీలోకి రాకపోవడంపై ప్రేక్షకులు నిరాశలో ఉన్నారు. కానీ, ఎట్టకేలకు ఈ మూవీ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఫిబ్రవరి 16 నుంచి ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ తమ అధికారిక ఎక్స్.కామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. “వేచి చూసే అధికారికంగా ముగిసిపోయింది. త్వరలోనే ఎంతగానో ఎదురుచూసిన ది కేరళ స్టోరీ జీ5లో ఫిబ్రవరి 16న స్ట్రీమింగ్ కాబోతోంది” అంటూ ప్రకటించారు. ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయాలంటూ సోషల్ మీడియాలో రిక్వెస్టులు పెడుతున్నారు. నెటిజన్స్ అభ్యర్థనను సరైన టీమ్ కి పంపుతామంటూ జీ5 ఓటీటీ సంస్థ రిప్లయ్ ఇచ్చింది. మరి.. ఎంతగానో ఎదురుచూసిన ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీలోకి వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి