iDreamPost
android-app
ios-app

OTTలో సత్తా చాటుతోన్న సేవ్ ది టైగర్స్ 2.. ఇండియాలోనే టాప్ 3లో

ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ కాంబోలో వచ్చిన సేవ్ ది టైగర్స్.. కిత కితలు పెట్టిస్తోంది. మార్చి 15 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‍లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్ రికార్డుల మోత మోగిస్తోంది.

ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ కాంబోలో వచ్చిన సేవ్ ది టైగర్స్.. కిత కితలు పెట్టిస్తోంది. మార్చి 15 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‍లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్ రికార్డుల మోత మోగిస్తోంది.

OTTలో సత్తా చాటుతోన్న సేవ్ ది టైగర్స్ 2.. ఇండియాలోనే టాప్ 3లో

ఇటీవల కాలంలో వచ్చిన కామెడీ ఎంటర్ టైనింగ్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ 2. సేవ్ ది టైగర్ కొనసాగింపుగా వచ్చిన ఈ వెబ్ సిరీస్.. మార్చి 15 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‍లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ఔట్ అండ్ ఔట్ కామెడీ పండించడంతో ట్రెమండస్ రెస్సాన్స్ వస్తుంది. యాత్ర దర్శకుడు మహి వి రాఘవ, చిన్న వాసుదేవ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించగా.. అరుణ్ కొత్త పల్లి దర్శకత్వం వహించాడు. దేవయాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, సీరత్ కపూర్ హీరోయిన్లు కాగా, గంగవ్వ, వేణు, సత్యకృష్ణ, రోహిణీ ఈ సిరిస్‌లో కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ఓటీటీలో దూసుకెళుతుంది.

సేవ్ ది టైగర్స్ 2 వెబ్ సిరీస్ ఓటీటీలో దుమ్ము రేపుతోంది. ఎక్కువ మంది చూసిన షోగా నిలించింది. కేవలం దక్షిణాదిలోనే కాదు.. ఇండియా వ్యాప్తంగా టాప్ 3లో నిలిచింది. ఈ షో ఇంత సక్సెస్ ఫుల్‌గా రన్ కావడంపై నిర్మాత మహి వి రాఘవ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘సేవ్ ది టైగర్స్ సిరీస్‌ను చూసి భారీ సక్సెస్ అందించటం చాలా సంతోషంగా ఉంది. రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సాధించటం సాధారణమైన విషయం కాదు. పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి మంచి విజయాలను సాధిస్తాయని మరోసారి రుజువైంది. కామెడీ వెబ్ షోలను ప్రేక్షకులు ఫ్యామిలీ చిత్రాలను భావిస్తారని నమ్మకం కుదిరింది’ అని పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలను తెలియజేశారు.

ఒక తెలుగు వెబ్ సిరీస్ టాప్ 3లో నిలవడం మామూలు విషయం కాదు. కాగా, ఈ రెండు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులు ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ కావడంతో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వాచ్ చేయడంతో సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కొనసాగింపుగా సీజన్ 3 కూడా ఉంటుందని, త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని పేర్కొన్నారు మహి వి రాఘవ. ఎవరైనా టాలెంట్ ఫిల్మ్ మేకర్స్, ఔత్సాహిక రచయిలు ఉంటే.. స్క్రిప్ట్స్ త్రీ ఆటమ్ లీవ్స్ నిర్మాణ సంస్థకు పంపాలని కోరుతున్నారు. కమాన్ గాయ్స్ ఇంకెందుకు ఆలస్యం.. మంచి కంటెంట్ ఉంటే.. ప్రూవ్ చేసుకునే అవకాశం మీ ముందుకు వచ్చింది. కథ నచ్చితే సేవ్ ది టైగర్స్ 3 తర్వలోనే షూటింగ్ జరుపుకోనుంది.