iDreamPost
android-app
ios-app

రిలీజై నెల రోజులు కూడా కాలేదు.. OTTలోకి వచ్చేస్తోన్న సర్కారు నౌకరీ మూవీ..!

జనవరి 1న విడుదలైన సినిమా సర్కారు నౌకరీ. టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు ఈ మూవీతో తెరంగేట్రం చేశాడు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి సందడి చేసేందుకు వచ్చేస్తోంది.

జనవరి 1న విడుదలైన సినిమా సర్కారు నౌకరీ. టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు ఈ మూవీతో తెరంగేట్రం చేశాడు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి సందడి చేసేందుకు వచ్చేస్తోంది.

రిలీజై నెల రోజులు కూడా కాలేదు.. OTTలోకి వచ్చేస్తోన్న సర్కారు నౌకరీ మూవీ..!

‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో’ అంటూ తన గాత్రంతో హృదయాలను దోచేశారు సింగర్ సునీత. ఆమె పాడుతుంటే.. చక్కెర తింటున్నంత తీయగా ఉంటుంది. ఆమె వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు..తనయుడు ఆకాష్ గోపరాజు. సర్కారు నౌకరి అనే మూవీతో ఇటీవల పలకరించాడు. జనవరి 1న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మంచి సినిమా అంటూ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా వసూళ్లను రాబట్టుకోలేకపోయింది. ఈ మూవీ చూసి సునీత కూడా ఎమోషనలైన సంగతి విదితమే. ఈ మూవీని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు నిర్మించగా..గంగనమోని శేఖర్ డైరెక్షన్ చేశారు.

సర్కారు నౌకరు అంటే.. సర్కారీ జీతం తీసుకోవడం కాదు.. ప్రజలకు సేవ చేయడం అంటూ ట్రైలర్‌లో డైలాగ్ చూస్తుంటేనే.. ఇదేదో సామాజిక సందేశాన్ని అందిస్తోన్న మూవీగా కనిపించింది. అన్నట్టుగా ఇది అలాంటి మూవీనే. ఎయిడ్స్ వంటి వ్యాధిపై అవగాహన కల్పించే ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపించాడు ఆకాష్. ఇంటింటికి కండోమ్స్ పంచే అతడికి ఊరు నుండి, కుటుంబ పరంగా ఎటువంటి అవమానాలు, సమస్యలు ఎదురయ్యాయన్నదే సినిమా కథ. ఇందులో ఆకాష్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీలో భావనా వళపండల్ హీరోయిన్‌గా నటించింది. తనికెళ్ల భరణి, సాయి శ్రీనివాస్ వడ్లామని, రాజేశ్వరి ముళ్లపూడి తదితరులు కీ రోల్ ప్లే చేశారు. శాండిల్య ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు.

తొలి మూవీ అయిన ఓ కొత్త కథ, కథనాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. థియేటర్లలో సందడి చేయలేకపోయిన సర్కారు నౌకరి మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. జనవరి 26 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. జనవరి 26న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలుంటే.. నెల రోజులు తిరగకుండానే ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తున్నట్లే లెక్క. ఈ మూవీని థియేటర్లలో చూడలేదు అనుకున్న వాళ్లు.. స్ట్రీమింగ్ అవ్వగానే చూసేసి.. మూవీ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.