Tirupathi Rao
OTT Releases: సినిమాలు అందరికీ ఇష్టమే.. కానీ, కొన్ని కొన్ని జానర్స్ అంటేనే ఇష్టంగా చూస్తారు. అలా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లు ఈ మూవీ తప్పకుండా చూడాల్సిందే.
OTT Releases: సినిమాలు అందరికీ ఇష్టమే.. కానీ, కొన్ని కొన్ని జానర్స్ అంటేనే ఇష్టంగా చూస్తారు. అలా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లు ఈ మూవీ తప్పకుండా చూడాల్సిందే.
Tirupathi Rao
అందరికీ అన్నీ జానర్ సినిమాలు నచ్చవు. కొందరు కామెడీ కోరుకుంటే.. ఇంకొందరు ఫ్యామిలీ డ్రామా ఇష్టపడతారు. కానీ, ఎక్కువ శాతం మంది మాత్రం సప్సెన్స్ క్రైమ్ థ్రిల్లర్లకే ఓటేస్తుంటారు. పైగా ఓటీటీలో చూడటం అంటే కచ్చితంగా క్రైమ్ థ్రిల్లర్ కావాలని అడుగుతారు. అలాంటి వారికి ఈ సినిమా కచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే శరత్ కుమార్ ఈ మూవీలో తన యాక్షన్ తోనే కాకుండా.. యాక్షన్ సీక్వెన్స్ తో కూడా అదరగొట్టేశాడు. ముఖ్యంగా వెయ్యేళ్ల క్రితం విగ్రహం చుట్టూ ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. ఈ మూవీలో యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, ట్విస్టులు అన్నీ గట్టిగానే ఉన్నాయి.
ఇప్పుడు మనం చెప్పుకుంటోంది శరత్ కుమార్, అమితాష్ ప్రధాన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన “పరంపోరుల్” మూవీ గురించి. ఈ సినిమా కథ ఏంటంటే.. నచ్చింది చేయాలనుకునే యువకుడు ఒకవైపు, అవినీతి పోలీసు అధికారి ఒకవైపు. కుటుంబసమస్యలతో నలిగిపోతున్న యువకుడు, కోట్లు సంపాదించాలని కోరుకుంటున్న పోలీసు జీవితాలను కలగలుపుతూ వారి మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా సాగుతూ ఉంటుంది. ఆ పోలీసు అధికారి(శరత్ కుమార్) కోట్లు సంపాదించడం కోసం గౌరి(అమితాష్ ప్రధాన్)ని పావుగా చేసి వాడుకుంటూ ఉంటాడు. కుటుంబ సమస్యలు, అనారోగ్యంతో ఉన్న చెల్లి ఆరోగ్యం బాగుపడుతుందని భావించి గౌరి కూడా ఆ కరప్టెడ్ పోలీస్ తో చేయి కలుపుతాడు. త్వరగా కోట్లు సంపాదించాలని రూ.వేల కోట్ల విలువైన వెయ్యేళ్ల పురాతన విగ్రహాన్ని అమ్మేందుకు రెడీ అయిపోతారు? అసలు ఆ విగ్రహం వాళ్లకి ఎక్కడిది? ఆ విగ్రహాన్ని అమ్మగలిగారా? ఆ విగ్రహాన్ని అమ్మె క్రమంలో వాళ్లు ఎన్ని కష్టాలు పడ్డారు అనేదే కథ.
ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిగానే సాగుతూ ఉంటుంది. అక్కడ కథలో వచ్చే ట్విస్టులు ఆడియన్స్ ని థ్రిల్ చేస్తూ ఉంటాయి. కుటుంబం కోసం ఒకరు, అత్యాసతో మరొకరు కోట్లు సంపాదిచాలని ఒక విగ్రహం పట్టుకుని పడే పాట్లు అలరిస్తాయి. ఒక పక్కా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూశామనే భావనను మాత్రం కలిగిస్తాయి. వీళ్లు విగ్రహం అమ్మడానికి వేసే స్కెచ్చులు, అందులో వారు పడే పాట్లు, మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. విగ్రహం అమ్మేందుకు వీళ్లు డీల్ పెట్టుకునే ప్రతి సీన్ మంచి సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ పరంపోరుల్ సినిమా ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి పాజిటివ్ గానే రివ్యూస్ వస్తున్నాయి. మరి.. ఈ పరంపోరుల్ సినిమా మీరు కూడా చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.