iDreamPost
android-app
ios-app

అనుకున్న టైమ్ కంటే ముందే OTTలోకి ‘టైగర్ నాగేశ్వరరావు’!

  • Author Soma Sekhar Published - 06:10 PM, Wed - 8 November 23

అనుకున్న టైమ్ కంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్నాడు మాస్ మహారాజా. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

అనుకున్న టైమ్ కంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్నాడు మాస్ మహారాజా. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

  • Author Soma Sekhar Published - 06:10 PM, Wed - 8 November 23
అనుకున్న టైమ్ కంటే ముందే OTTలోకి ‘టైగర్ నాగేశ్వరరావు’!

థియేటర్లలో సినిమాలు చూడటం మిస్ అయిన ప్రేక్షకులు.. అవి ఓటీటీల్లోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని మూవీలకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు సదరు మూవీ మేకర్స్ అండ్ ఓటీటీ కంపెనీలు. అయితే కొన్ని పిక్చర్స్ అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీలోకి వస్తూ.. మూవీ లవర్స్ ను సర్ఫ్రైజ్ చేస్తుంటాయి. తాజాగా ఇదే జాబితాలోకి వచ్చి చేరింది మాస్ మహారాజా రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’. అక్టోబర్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇదిలా ఉండగా.. అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీలోకి వస్తోంది ఈ చిత్రం. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

టైగర్ నాగేశ్వరరావు.. మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ పోషించగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణుదేశాయ్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి వంశీకృష్ణ నాయుడు, వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైగర్ నాగేశ్వరరావు ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో అనుకున్న టైమ్ కంటే ముందుగానే ఈ మూవీని ఓటీటీలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా నటించిన ఈ చిత్రం డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా.. ప్లాన్ ప్రకారం ఆరు వారాల తర్వాత ఓటీటీలోకి తీసుకొద్దామని అనుకున్నారు.

కానీ మూవీ రిజల్ట్ తేడా కొట్టడంతో.. డిసెంబర్ మెుదటి వారంలో తీసుకొద్దామనుకున్న టైగర్ ని.. అనుకున్న టైమ్ కంటే ముందుగానే అంటే నవంబర్ 24న ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటు మేకర్స్ నుంచి గానీ.. అటు అమెజాన్ ప్రైమ్ నుంచి గానీ రాలేదు. ఇక ఈ న్యూస్ విని రవితేజ అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. కాగా.. ఓటీటీలోకి ముందుగానే వచ్చే లిస్ట్ లో దళపతి విజయ్ ‘లియో’ మూవీ కూడా ఉన్నట్లు సమాచారం. లియో కూడా రిలీజ్ అయిన నెల తర్వాతే ఓటీటీలో విడుదల కావాల్సింది. కానీ ఈ మూవీకి సంబంధించిన ఫుల్ హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ అవ్వడంతో నవంబర్ 24న ఓటీటీ రిలీజ్ చేద్దామనుకున్న లియోని నవంబర్ 16నే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş