iDreamPost
android-app
ios-app

Eagle Movie: రెండు OTTల్లోకి రానున్న రవితేజ ఈగల్‌ సినిమా.. ఏవంటే..

  • Published Feb 27, 2024 | 9:43 AMUpdated Feb 27, 2024 | 9:43 AM

రవితేజ నటించిన ఈగల్‌ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఇంతకు ఆ ఓటీటీలు ఏవి అంటే..

రవితేజ నటించిన ఈగల్‌ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఇంతకు ఆ ఓటీటీలు ఏవి అంటే..

  • Published Feb 27, 2024 | 9:43 AMUpdated Feb 27, 2024 | 9:43 AM
Eagle Movie: రెండు OTTల్లోకి రానున్న రవితేజ ఈగల్‌ సినిమా.. ఏవంటే..

టాలీవుడ్‌లో వరుస సినిమాలు తీయడంలో మాస్‌ మహారాజ రవితేజ ముందు వరుసలో ఉంటారు. హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఏడాదికి 3, 4 సినిమాలు విడుదల చేస్తుంటారు. ఇక ఈ ఏడాది ఈగల్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు రవితేజ. సంక్రాంతి బరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా అప్పుడు తప్పుకుని.. ఫిబ్రవరిలో విడుదల అయ్యింది. ఈ నెల అనగా ఫిబ్రవరి 9న ఈగల్‌ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఫస్ట్‌ రెండు, మూడు రోజులు భారీ కలెక్షన్స్‌ సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాత జోరు తగ్గగా.. అంచనాలను అందుకోలేకపోయింది.

యాక్షన్ థ్రిల్లర్‌గా ఈగల్ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని. రవితేజ గెటప్, యాక్షన్ సీన్లు ఈ మూవీలో హైలైట్‍గా నిలిచాయి. ఈ క్రమంలో తాజాగా ఈగల్‌ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ కానుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఈగల్‌ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. మరి అవి ఏవి అంటే..

ఈగల్ సినిమా రెండు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు రెడీ అయ్యింది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ కూడా దక్కించుకుంది. ఈ విషయం తాజాగా తెలిసింది. అయితే ఇప్పటికే ఈగల్‌ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానున్న సంగతి తెలిసిందే. అంటే ఈగల్‌ ఈటీవీ, అమెజాన్‌ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానుంది. దీనిపై మూవీ లవర్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే ఈగల్ సినిమా స్ట్రీమింగ్‌ ఉండనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో నేడు అధికారికంగా ప్రకటించింది. కానీ స్ట్రీమింగ్ డేట్‍ను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈగల్‌ స్ట్రీమింగ్‌ విషయానికి వస్తే.. మార్చి 2న లేదా.. 8వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఈటీవీ విన్, అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో ఈగల్‌ స్ట్రీమింగ్‌ కానుందనే విషయం మాత్రం అధికారికం.

ఈగల్ చిత్రంలో రవితేజ మరోసారి తన మాస్‌ యాక్టింగ్‌తో అందరినీ మెప్పించాడు. ఇక ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‍గా నటించగా.. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, మధు, శ్రీనివాస్ అవకరాల, మధూ, అజయ్ ఘోష్, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలు పోషించారు. సినిమాటోగ్రాఫర్‌గా పాపులర్ అయిన కార్తిక్ ఘట్టమనేనికి దర్శకుడిగా ఈగల్ రెండో మూవీ.

ఇక ఈగల్‌ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.35కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే భారీగా అంచనాలను పెట్టుకున్నప్పటికి.. బాక్సాఫీస్‌ వద్ద వాటిని అందుకోలేకపోయింది. ఈగల్‌ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి