Venkateswarlu
Boys Hostel OTT Release: ‘హాస్టల్ హుడగరు బేకాగిద్దారే..’ సినిమా కన్నడ నాట సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 25 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఇప్పుడు తెలుగులో డబ్ అయింది.
Boys Hostel OTT Release: ‘హాస్టల్ హుడగరు బేకాగిద్దారే..’ సినిమా కన్నడ నాట సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 25 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఇప్పుడు తెలుగులో డబ్ అయింది.
Venkateswarlu
కథ బాగుంటే చాలు.. సినిమా పెద్దదా.. చిన్నదా అని ప్రేక్షకులు పట్టించుకోరు. చిన్న సినిమాను కూడా పెద్ద హిట్టు చేసేస్తుంటారు. కోటి బడ్జెట్‌తో తెరకెక్కి వంద కోట్లు కొల్లగొట్టిన సినిమాలు చిత్ర పరిశ్రమలో చాలా ఉన్నాయి. కొన్ని చిత్రాలు కోట్లు కొల్లగొట్టకపోయినా.. ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ‘‘ హాస్టల్ హుడగరు బేకాగిద్దారే ’’ ఒకటి. ఈ మూవీ జులై నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడనాట సంచలన విజయం సాధించింది.
తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి భారీ వసూళ్లను కొల్లగొట్టింది. కన్నడనాట సంచలన విజయంగా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో కూడా సందడి చేస్తోంది. ‘హాస్టల్ హుడగరు బేకాగిద్దారే..’’ అన్న మూవీనే తెలుగులోకి డబ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ‘‘ హాస్టల్ బాయ్స్’’గా డబ్ అయింది. ప్రజ్వల్, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ప్రధాన పాత్రల్లో నటించారు. కన్నడ సినిమాలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రమ్యలు గెస్ట్ రోల్స్ చేశారు. ఇక, తెలుగు డబ్‌లో రిషబ్ శెట్టి, తరుణ్ భాస్కర్, రష్మీ గౌతమ్‌లు గెస్ట్ పాత్రల్లో కనిపించారు. నితిన్ క్రిష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు.. అజనీస్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. కన్నడ నాట ఈ చిత్రం ఏకంగా 25 కోట్ల రూపాయల వసూళ్లను కొల్లగొట్టింది.
ఇంతకీ కథ ఏంటంటే..
కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ తుంగ బాయ్స్ హాస్టల్‌లో ఉంటారు. అజిత్ అనే యువకుడు ఎప్పటికైనా డైరెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. అతడి కథలు సరిగ్గాలేని కారణంగా మిత్రులు అతడ్ని తిడుతూ ఉంటారు. దీనికి తోడు అజిత్ బ్యాచ్‌కు వార్డెన్‌కు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఓ రోజు వార్డెన్ ఆత్మహత్య చేసుకుంటాడు. తన చావుకు అజిత్ అతడి స్నేహితులే కారణం అని సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టి ఉంటాడు. దీంతో కేసు తమ మీదకు వస్తుందని వారు భావిస్తారు. బాడీని మాయం చేసే ప్రయత్నం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందనేదే మిగితా కథ. మరి, హాస్టల్ బాయ్స్ ప్రస్తుతం ‘ ఆహా’లో స్ట్రీమింగ్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.