iDreamPost
android-app
ios-app

OTTలో బెస్ట్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.. కథ మొత్తం ఇద్దరి మధ్యే జరుగుతుంది..

  • Published May 30, 2024 | 5:51 PM Updated Updated May 31, 2024 | 11:11 AM

OTT Suggestions- Must Watch Best Revenge Love Story: మీరు ఇప్పటివరకు చూసిన ప్రేమకథలు మొత్తం ఈ మూవీ చూసిన తర్వాత సైడ్ అయిపోతాయ్. అరె ఇలాంటి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుందా? అనే విషయం మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది.

OTT Suggestions- Must Watch Best Revenge Love Story: మీరు ఇప్పటివరకు చూసిన ప్రేమకథలు మొత్తం ఈ మూవీ చూసిన తర్వాత సైడ్ అయిపోతాయ్. అరె ఇలాంటి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుందా? అనే విషయం మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది.

  • Published May 30, 2024 | 5:51 PMUpdated May 31, 2024 | 11:11 AM
OTTలో బెస్ట్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.. కథ మొత్తం ఇద్దరి మధ్యే జరుగుతుంది..

మీరు లవ్ స్టోరీస్ ని బాగా ఇష్టపడతారా? అయితే ఇప్పటివరకు చాలానే లవ్ స్టోరీలు చూసుంటారు. అందులో కచ్చితంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఉండే ఉంటాయి. ట్రయాంగిల్ అంటే కచ్చితంగా ముగ్గురు మధ్య జరిగే లవ్ స్టోరీ. అంటే ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమించడం. లేదా ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ఇష్టపడటం. ఇలా జెండర్ మారచ్చు కానీ అంకె మాత్రం మారదు. ఇప్పుడు మీకు చెప్పే సినిమా కూడా ఒక మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీనే. కాకపోతే ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారు. అరె.. అలా ఎలా? మరి.. ట్రయాంగిల్ ఎలా అవుతుంది అనుకుంటున్నారా? అదే అసలు కథ మరి.

సాధారణంగా మీరు ఎన్నో ప్రేమకథలు చూసుంటారు. ఆ ప్రేమకథల్లో ప్రేమించిన అమ్మాయి, అబ్బాయి కోసం త్యాగాలు చేస్తారు. అలాగే కొందరు ప్రేమించిన వారి కోసం హత్యలు కూడా చేస్తారు. సీరియల్స్ లో అయితే ఈమధ్య ప్రేమించిన వాడికోసం ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ముఖాలు మార్చుకుని వచ్చినవాళ్లు కూడా ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు మీకు కాస్త థ్రిల్, ఇంకాస్త ఎగ్జైట్మెంట్ వచ్చి ఉంటుంది. అయితే ఈ మూవీలో మీకు అవి టన్నుల కొద్దీ ఉంటాయి. ఒక్కో ట్విస్టు, ఒక్కో మలుపు రివీల్ అవుతూ ఉంటే మబ్బులు విడిపోతూ ఉంటాయి. అసలు ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? అనే విషయం మిమ్మల్ని పిచ్చోళ్లు అయ్యేలా చేస్తుంది.

MukhaChitram

ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఏమైనా చేస్తారు. కానీ, అదే వ్యక్తి మోసగాడు అని తెలిస్తే మాత్రం ఏం చేయరు. కానీ, ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం తగిన శాస్తి చేస్తుంది. తాను ప్రేమించింది.. ఒక సైకో అని శాడిస్ట్ అని తెలుసుకుంటుంది. కాకపోతే తెలుసుకునే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇంతకన్నా కథను రివీల్ చేస్తే మీకు చూడటానికి ఇంట్రస్ట్ పోతుంది. ఈ మూవీలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒక స్పెషల్ అప్పియరెన్స్ కూడా ఇచ్చాడు. ఇందులో ఒక పవర్ ఫుల్ లాయర్ రోల్ లో విశ్వక్ సేన్ కనిపిస్తాడు. మాస్ కా దాస్ సినిమా ఓకే చేశాడు అంటే కచ్చితంగా కథలో విషయం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇంతకన్నా ఈ మూవీ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారిట్రైలర్ చూస్తే మీకే అర్థమైపోతుంది. కాబట్టి మీరు ఈ మూవీని అయితే కచ్చితంగా చూడాల్సిన చిత్రం. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా.. ఒక్కో సీన్ కి ఒక్కో ట్విస్టుతో బుర్రలను గిర్రున తిప్పేస్తూ ఉంటారు. ఈ చిత్రం పేరు ముఖచిత్రం. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఇప్పటికే ఈ మూవీని గనుక చూసేసుంటే.. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom