Thalavan Movie OTT Review: రీసెంట్ సూపర్ హిట్ మూవీ తలవన్ OTT రివ్యూ

Thalavan Movie OTT Review : బిజు మీనన్ , ఆసిఫ్ అలీ హీరోలుగా నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ “తలవన్”.. ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ లో చూసేద్దాం.

Thalavan Movie OTT Review : బిజు మీనన్ , ఆసిఫ్ అలీ హీరోలుగా నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ “తలవన్”.. ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ లో చూసేద్దాం.

తలవన్

10-09-2024, crime investigation thriller ,
  • నటినటులు: బిజు మీనన్ , ఆసిఫ్ అలీ ,
  • దర్శకత్వం:జిస్ జాయ్
  • నిర్మాత:
  • సంగీతం:
  • సినిమాటోగ్రఫీ:శరన్ వేలాయుధన్

Rating

2.5

సాధారణంగా మలయాళీ సినిమాలను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అందులోను మలయాళీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే ఇంకాస్త క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో రీసెంట్ గా బిజు మీనన్ , ఆసిఫ్ అలీ హీరోలుగా నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ “తలవన్” ఓటీటీ లోకి వచ్చేసింది. దాదాపు 10కోట్ల బడ్జెట్ తో థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ఊహించని విధంగా.. 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ లో.. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మరాఠి, బెంగాలీ, కన్నడ సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఏంటో రివ్యూ లో చూసేద్దాం.

కథ:

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎస్ ఐ కార్తీక్ వాసుదేవన్ ( ఆసిఫ్ అలీ) ట్రాన్స్ఫర్ సిఐ జయశంకర్ (బిజూ మీనన్) పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ కు వస్తాడు. వీరిద్దరికి ఒకరంటే ఒకరికి అసలు పడదు. ఎదురైన ప్రతి సారి ఎదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. దీనితో ఓసారి బిజుపై రివెంజ్ తీర్చుకోడానికి ట్రై చేస్తాడు అసిఫ్. ఈ క్రమంలో కొన్నాళ్ళకు బిజూ మీనన్ ఇంటి పై రమ్య అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. ఇదే అదునుగా భావించి అతనిని అరెస్ట్ చేయిస్తాడు అసిఫ్. నిజంగానే ఆ హత్యకు, బిజూ కు ఏదైనా సంబంధం ఉందా ? ఈ కేసు నుంచి బిజు మీనన్ ఎలా బయటపడ్డాడు ? ఇంతకీ రమ్యను హత్య చేసింది ఎవరు ? ఈ కేసును ఆసిఫ్ చేపట్టడానికి కారణం ఏంటి ? అతను బీజుని కాపాడాడ లేదా కేసు నుంచి బయటకు రానివ్వకుండా చేశాడా? చివరికి ఏమైంది ? అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ:

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసుకుని రూపొందించిన కథలన్నీ కూడా.. ప్రేక్షకులను ఎప్పుడు మెప్పిస్తునే ఉంటాయి. మేకర్స్ కూడా వీటిని అంతే ఉత్కఠభరితంగా రూపొందించడంతో.. ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా వాటిని ఆదరిస్తున్నారు. ఇక వీటిలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలైతే.. మూవీ లవర్స్ ను రెండున్నర గంటల పాటు సీట్ ఎడ్జ్ లో కుర్చోపెట్టేస్తాయని చెప్పి తీరాలి. మరి ముఖ్యంగా మలయాళీ సినిమాలు వీటికి పెట్టింది పేరు. అచ్చం ఇలాంటి కథనే ప్రేక్షకుల ముందుంచి.. తలవన్ డైరెక్టర్ జిస్ జాయ్ సక్సెస్ సాధించారు. సినిమాలో బిజూ మీనన్ , ఆసిఫ్ అలీ క్యారెక్టర్స్ ఎలివేట్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. అక్కడ మూవీ కొంచెం ల్యాగ్ అనిపించినా కూడా.. బిజూ మీనన్ ఇంటి పైన జరిగిన హత్య తర్వాత అసలు కథ మొదలవుతుంది. అసలు బిజూ ఇంటికి బయట మెట్లు లేకపోయినా కూడా.. తన ఇంటిపైకి డెడ్ బాడీ ఎలా వచ్చింది అనేది అక్కడ అందరికి ప్రశ్నార్థకంగా మారుతుంది.

ఇక అప్పటికే బిజూ ఆమెను రెండు మూడు సార్లు కలిసి ఉండడంతో.. తానే ఆ హత్య చేశాడనే అనుమానాలు వ్యక్తమౌతాయి. ఇక అప్పటినుంచి కథ కాస్త ఊపందుకుంటుంది. అసిఫ్ అలీ ఈ ఇన్వెస్టిగేషన్ ను కొనసాగించిన తీరు చివరి వరకు ఎంగేజింగ్ గా కొనసాగుతూ ఉంటుంది. ఈ మూవీ సెకండ్ ఆఫ్ మొత్తం.. బిజూ మీనన్ , అసిఫ్ అలీ ఇన్వెస్టిగేషన్ తోనే కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో అక్కడక్కడా కొన్ని సీన్స్ లాజిక్స్ కు అందవు. ఇక క్లైమాక్స్ లో మరీ అంత చెప్పుకోదగిన ట్విస్ట్ లు లేకపోయినా కూడా.. చివరి వరకు దర్శకుడు ఎంగేజింగ్ గా ఉంచిన తీరు బావుంది. పగ, ప్రతీకారం అనేది కొన్ని సినిమాలలో వైలెంట్ గా ఉంటే.. కొన్ని సినిమాలలో మాత్రం సైలెంట్ గా ఉంటూ ఉంటుంది. తలవాన్ సినిమా వాటిలో రెండో కోవకు చెందింది. వైలెంట్ గా కాకుండా సైలెంట్ గా ఓ రివేంజ్ డ్రామా చూడాలంటే మాత్రం.. ఈ మూవీ బెస్ట్ ఛాయస్. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో కలిసి.. ఈ సినిమాను చూడొచ్చు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

నటి నటులు పని తీరు :

అసిఫ్ అలీ , బిజూ మీనన్ ఈ మూవీలో పోటీ పడి నటించారని చెప్పి తీరాల్సిందే. ముఖ్యంగా అసిఫ్ అలీకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ లభించింది. మూవీ మొత్తం మీద వీరిద్దరే ఎక్కువ హైలెట్ అవుతారు. ఇక మిగిలిన నటి నటులంతా కూడా.. తమ పరిధి మేరకు నటించారు. ఈ మూవీ కథలో కొత్తదనం లేకపోయినా కూడా.. దర్శకుడు కథను ప్రేక్షకులను ఆకట్టుకునేలా మలచిన తీరు మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది.

బలాలు:

  • కథ
  • అసిఫ్ అలీ, బిజూ మీనన్ నటన

బలహీనతలు :

  • ఫస్ట్ హాఫ్
  • అక్కడక్కడ లాజిక్స్ మిస్ అవ్వడం

చివరిగా : తలవన్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది

రేటింగ్ : 2.5/5

(*గమనిక: ఈ రివ్యూ సమీక్షకుని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Show comments