PT Sir OTT Review In Telugu: హిప్‌హాప్ తమిళ హీరోగా నటించిన పీటీ సార్ మూవీ రివ్యూ

PT Sir Review: హిప్‌హాప్ తమిళ హీరోగా నటించిన పీటీ సార్ మూవీ రివ్యూ

PT Sir Movie Review & Rating (OTT Release): మ్యూజిక్ డైరెక్టర్ నుండి హీరోగా మారిన మరో నటుడు హిప్‌హాప్ తమిళ ఆది. ఇటీవల పీటీ సార్ అంటూ తమిళ ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకు ఈ మూవీ ఎలా ఉందంటే.. ఈ రివ్యూ చదివేయండి.

PT Sir Movie Review & Rating (OTT Release): మ్యూజిక్ డైరెక్టర్ నుండి హీరోగా మారిన మరో నటుడు హిప్‌హాప్ తమిళ ఆది. ఇటీవల పీటీ సార్ అంటూ తమిళ ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకు ఈ మూవీ ఎలా ఉందంటే.. ఈ రివ్యూ చదివేయండి.

హీరోగా మారిన మరో మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమిళ. తమిళంతో పాటు తెలుగులో కూడా పలు చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. ధృవ, కృష్ణార్జున యుద్ధం, ఎ 1 ఎక్స్ ప్రెస్, ఏజెంట్ వంటి చిత్రాలకు బాణీలు సమకూర్చాడు. సంగీత దర్శకుడు మాత్రమే కాదు.. సింగర్, రైటర్, డైరెక్టర్ కూడా. మ్యూజిక్ అందిస్తూనే.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తమిళ. మీసయ్య మురుక్కు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు ఇటీవల పీటీ సార్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాశ్మీర పరదేశి హీరోయిన్. అనిఖ సురేంద్రన్ కీలక పాత్రలో కనిపించింది. మే 24న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజై నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మరీ ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.

కథ

జీపీ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో కనగవేల్ (హిప్‌హాప్ తమిళ) పీటీ సర్‌గా వర్క్ చేస్తుంటారు. అదే స్కూల్లో పనిచేస్తున్న టీచర్ వానతి (కాశ్మీర పరదేశీ)ని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేకపోతుంటాడు. అయితే ఆ స్కూల్ టెర్రస్ పై మ్యాజిక్ వాల్ ఏర్పాటు చేసి పిల్లల అభిప్రాయాలు అందులో రాసేలా చేస్తాడు. అలా స్పోర్ట్స్ డే జరిగేలా చేస్తాడు. అయితే ఇతడ్ని తల్లి మహేశ్వరి (దేవదర్శిని) చాలా జాగ్రత్తగా.. గొడవలు జోలికి వెళ్లకుండా పెంచుతుంది. అతడి జాతకంలో దోషం వల్ల అలా చేస్తూ ఉంటుంది. అతడికి ఎంత త్వరగా పెళ్లి చేస్తే ఆ దోషం పోతుందని చెప్పగానే సంబంధాలు వెతుకుతూ ఉంటుంది. కనగవేల్ ఇంటికి ఎదురుగా ఉన్న నందిని (అనిఖ సురేంద్రన్) జీపీ కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉంటుంది. ఆమె ఓ రోజు రాత్రి ఇంటికి ఆలస్యంగా వస్తే.. ఇరుగు పొరుగు సూటి పోటీ మాటలు అంటే.. తట్టుకోలేక ఓ రోజు ఆత్మహత్యకు యత్నించగా. . హీరో హీరోయిన్లు కాపాడతారు. అంతలో వానతి హీరోకు లవ్ ప్రపోజ్ చేయడంతో..పేరెంట్స్ ఒప్పుకుని ఎంగేజ్ మెంట్ చేయడానికి సిద్దమౌతారు. అంతలో నందిని కనిపించదు. తీరా పోలీసులు ఫోన్ చేసి.. పాప చనిపోయిందటూ ఆమె తల్లిదండ్రులకు కబురు పెడతారు. హీరో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని అక్కడకు వెళతాడు. చెరువులో నుండి నందిని మృతదేహాన్ని బయటకు తెచ్చిన వ్యక్తి .. ఆమె చేతిలో ఓ సూసైడ్ లెటర్ దొరికిందని అది పోలీసులకు ఇచ్చానని చెబుతాడు. ఇంతకు ఆ లెటర్‌లో ఏమీ రాసి ఉంది. జీపీ ఇన్ స్టిట్యూట్ అధినేత పురుషోత్తం (త్యాగరాజన్ (హీరో ప్రశాంత్ తండ్రి))కి నందిని మరణానికి కారణాలు ఏంటీ? పీటీ సార్ ఏం చేశాడో తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఇది స్పోర్ట్ డ్రామా అయినప్పటికీ.. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. సినిమా నందిని (అనిఖ సురేంద్రన్) చుట్టూ తిరుగుతుంది. ఆమె ఓసారి మిస్ కావడం, పోకిరీలు ఆమె ఒంటిపై చేయి వేయడం, ఆ తర్వాత చనిపోవడం, దొరికిన లెటర్ జీపీ హెడ్ కాల్చేయడం సినిమాపై ఆసక్తిని కలిగిస్తాయి. తొలుత కాస్తంత కామెడీ టచ్ ఇచ్చిన దర్శకుడు కార్తీక్ వేణుగోపాలన్. తర్వాత తర్వాత సీరియస్ అండ్ కోర్టు డ్రామా నడిపించాడు. డబ్బు అధికారం, అవినీతి మిడ్ క్లాస్ జీవితాలో ఎలా ఆడుకుంటాయో దర్శకుడు చూపించాడు. తను అనుకున్నది అనుకున్నట్లుగా తీశాడు. థియేటరల్లో ఓ వర్గానికి ఈ సినిమా కనెక్ట్ కాలేదు. నెగిటివ్ రివ్యూ వల్లే పెద్దగా ఆడలేదు.. కానీ ఐఎండీబీ మంచి రేటింగ్ ఇచ్చింది. సినిమా కూడా తీసి పడేయడానికి లేదు. పెద్దగా చెప్పుకోదగ్గ లోపాలేవీ ఉండవు. కొన్ని చోట్ల సమాజంలో జరుగుతున్న సంఘటనలతో ముడిపెట్టినట్లు కనిపిస్తుంది. అలాగే ఈ సినిమా ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ మూవీకి హైలెట్

ఎవరెలా నటించారంటే..

హీరోగా హిప్‌హాప్  తమిళ ఓకే కానీ.. తమిళ బాణీలు కాబట్టి.. తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కావు. తొలి సగం అంతా అమాయకుడిగా..పిరికివాడిగా కనిపించే హీరో.. సెకండాఫ్ నుండి మాస్, యాక్షన్స్‌లోకి దిగిపోతాడు. ఇక కాశ్మీర పరదేశీ కూడా నో గ్లామర్.. శారీల్లో మెప్పించింది. ఇక పోతే అనిఖ సురేంద్రన్‌కు మంచి పాత్రే దక్కింది. మంచి ఫెర్మామెన్స్ కనబర్చింది. స్టేట్ రౌడీ, మగాడు చిత్రాల్లో విలన్ గా నటించిన త్యాగరాజన్ నాలుగేళ్ల తర్వాత విలన్ రోల్ నటించిన మూవీ ఇది. తన విలనీజం ఛాయలు ఏ మాత్రం తగ్గలేదు. ఇక దేవదర్శినీ, ప్రభు క్యారెక్టర్స్ బాగున్నాయి. ఇక ఈ మూవీకి స్క్రీన్ ప్లేనే ప్రధాన ఆకర్షణ. చాలా నీట్‌గా ఉంది. ఎడిటింగ్ ఓకే, మాదేష్ మాణిక్యం సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తానికి సినిమా మస్ట్ వాచబుల్.

Show comments