iDreamPost
android-app
ios-app

నేనూ మనిషినే..అలా చేయొద్దు అంటూ అనిఖా ఎమోషనల్!

  • Published May 20, 2024 | 2:28 PM Updated Updated May 20, 2024 | 2:32 PM

Anikha Surendran Emotion: ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోయిన్లపై సోషల్ మీడియాలో రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. వారి డ్రెస్సింగ్, లుకింగ్, యాక్టింగ్ పై కామెంట్స్ చేయడంతో నటీమణులు ఎమోషన్ కి గురవుతున్నారు.

Anikha Surendran Emotion: ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోయిన్లపై సోషల్ మీడియాలో రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. వారి డ్రెస్సింగ్, లుకింగ్, యాక్టింగ్ పై కామెంట్స్ చేయడంతో నటీమణులు ఎమోషన్ కి గురవుతున్నారు.

  • Published May 20, 2024 | 2:28 PMUpdated May 20, 2024 | 2:32 PM
నేనూ మనిషినే..అలా చేయొద్దు అంటూ అనిఖా ఎమోషనల్!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు తర్వాత హీరో, హీరోయిన్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. కొంతమంది ఇండస్ట్రీలో టాప్ పొజీషన్లో ఉంటే.. మరికొంతమంది కంటికి కనిపించకుండా పోయారు. బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన మాలీవుడ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇటీవల ‘బుట్ట బొమ్మ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్‌ తెరకెక్కంచిన ఈ చిత్రం అనిఖాకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. కాకపోతే నటిగా మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి అనిఖా తన లైఫ్ లో జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ.. ఎమోషన్ కి గురైంది. వివరాల్లోకి వెళితే..

బాల నటిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలతో నటించిన అనిఖా సురేంద్రన్ మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించింది. అజిత్ నటించిన ఎన్నై అరిందాల్‌ (తెలుగు లో విశ్వాసం), నాన్ రౌడీ థాన్, మృధన్ వంటి చిత్రాల్లో బాలనటిగా నటించింది. కింగ్ నాగార్జున నటించిన ది గోస్ట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. బాల నటిగా తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న అనిఖా తర్వాత ‘బుట్టబొమ్మ’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయం పరిచయమైంది.కాకపోతే ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. సోషల్ మీడియాలో అనిఖా ట్రెండింగ్ దుస్తుల్లో..చిట్టి పొట్టి నిక్కర్లతో సెగలు పుట్టించే భంగిమల్లో ఫోటోలు షేర్ చేస్తుంది.

నవతరం హీరోయిన్ కనుక కాస్త మోడ్రన్ లుక్ తో కుర్రాళ్లను టెమ్ట్ చేస్తుంది.దీంతో ఈ అమ్మడిపై పాజిటీవ్ కన్నా నెగిటీవ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న బ్యాడ్ కామెంట్స్ పై స్పందించింది. ‘ సినీ ఇండస్ట్రీలో ట్రెండింగ్ గా కనిపిస్తే దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.ఆకర్షణీయంగా డెస్సులు వేసుకోవడం నా పర్సనల్ విషయం, నా స్టైలింగ్ నా ఇష్టం. ఎవరో విమర్శించారని నేను నా ఇష్టాన్ని పక్కన పెట్టలేను. ఇండస్ట్రీలో ఇలాంటి విమర్శలు రావడంత సర్వసాధారణం. కామెంట్ చేయాలనుకునేవారు చీర కట్టులో ఉన్నా చేస్తారు. నా దుస్తుల విషయంలో చేస్తున్న కామెంట్స్ శృతిమించిపోయాయి.. నేను మనిషినే. దయచేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ప్లీజ్ ఇకపై అలాంటి కామెంట్స్ చేయకండి’ అంటూ ఎమోషన్ అయ్యింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet