iDreamPost
android-app
ios-app

వీడియో: బాయ్‌ ఫ్రెండ్‌తో యంగ్‌ హీరోయిన్‌ చక్కర్లు!

  • Published Jul 26, 2023 | 9:26 AM Updated Updated Jul 26, 2023 | 9:26 AM
  • Published Jul 26, 2023 | 9:26 AMUpdated Jul 26, 2023 | 9:26 AM
వీడియో: బాయ్‌ ఫ్రెండ్‌తో యంగ్‌ హీరోయిన్‌ చక్కర్లు!

బాల నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు ‘అనికా సురేంద్రన్‌’. 2007లో వచ్చిన ‘చోటా ముంబై’ అనే మలయాళ సినిమాతో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. అజిత్‌ హీరోగా 2014లో వచ్చిన ‘ఎన్నై ఎరిందాల్‌’తెలుగులో ‘ఎంతవాడు గాని’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో పలు హిట్టు సినిమాల్లో నటించారు. ది గోస్ట్‌ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. 2023లో రిలీజైన బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్‌గా మారారు. ప్రస్తుతం మలయాళంలో హీరోయిన్‌గా పలు సినిమా చేస్తున్నారు.

హీరోయిన్‌గానే కాదు.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న పలు చిత్రాలు ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక, సినిమాలనుంచి బ్రేక్‌ దొరకటంతో ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌కు వెళ్లారు అనికా. అక్కడ ఫ్రెండ్స్‌తో కలిసి పిచ్చపాటి ఎంజాయ్‌ చేశారు. ప్రస్తుతం ఆ వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే అనికాతో పాటు వెకేషన్‌లో ఉన్న ఓ వ్యక్తి ప్రత్కేక ఆకర్షణగా నిలిచాడు.

అంతేకాదు! ఓ రూమర్‌కూడా తెరతీశాడు. ఆ వ్యక్తే నటుడు, నిర్మాత గోవింద పద్మ సూర్య. వెకేషన్‌లో అనికాతో గోవింద చాలా క్లోజ్‌ తిరగటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఇద్దరికీ దాదాపుగా 7 ఏళ్లనుంచి పరిచయం ఉంది. ఇద్దరూ మంచి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారి ఉండొచ్చన్న వదంతులు వస్తున్నాయి. పలు మీడియా సంస్థలు అతడే ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ అంటూ వార్తలు కూడా రాసేశాయి. అయితే, వీరిద్దరి మధ్యా ఉన్న రిలేషన్‌ ఏంటన్నది ఆ ఇద్దరికే తెలియాలి. లేదంటే.. ఈ పుకార్లపై ఇద్దరూ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరి, గోవింద, అనికా బాయ్‌ ఫ్రెండ్‌ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Govind Padmasoorya (GP) (@padmasoorya)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet