IC 814: The Kandahar Highjack: OTT లోకి దేశాన్ని వణికించిన..అతి పెద్ద ఫ్లైట్ హైజాక్ పై సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

OTT లోకి దేశంలో అతి పెద్ద హైజాక్ ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’.. వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

IC 814: The Kandahar Highjack: ఇండియన్ ఏవియేషన్ చరిత్ర దశ దిశను మార్చేసిన ఓ హైజాక్ నేపథ్యంలో సాగే సిరీస్ త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లోకి నేరుగా స్ట్రీమింగ్ కానుంది. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ కూడా నేడు రిలీజైంది. ఇంతకీ ఎక్కడంటే..

IC 814: The Kandahar Highjack: ఇండియన్ ఏవియేషన్ చరిత్ర దశ దిశను మార్చేసిన ఓ హైజాక్ నేపథ్యంలో సాగే సిరీస్ త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లోకి నేరుగా స్ట్రీమింగ్ కానుంది. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ కూడా నేడు రిలీజైంది. ఇంతకీ ఎక్కడంటే..

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.  ఈ క్రమంలోనే.. ప్రతి నెల, ప్రతి వీకెండ్ వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో భాషతో సంబంధం లేకుండా.. డజన్ల కొద్ది సినిమాలు, వెబ్ సిరీస్ లు నేరుగా వస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని యదార్థ సంఘటనలు ఆధారంగా తెరకెక్కినవి కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే త్వరలో ఓటీటీలోకి మరో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. అయితే ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్లేన్ హైజాక్ గా భావించే కాందహార్ హైజాక్ ఘటన ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ కావడం గమన్హారం. మరీ ఆ వెబ్ సిరీస్ పేరే ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో నేరుగా స్ట్రీమింగ్ కు రానుంది. అంతేకాకుండా..  తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ నేడు సోమవారం(ఆగస్టు19) న రిలీజ్ అయ్యింది. ఇంతకీ ఎక్కడంటే..

ఇండియన్ ఏవియేషన్ చరిత్ర దశ దిశను మార్చేసిన ఓ హైజాక్ నేపథ్యంలో సాగే సిరీస్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లోకి నేరుగా స్ట్రీమింగ్ కానుంది.  189 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ విమానం హైజాకర్ల బారిన పడిన భయానక ఘటన ఆధారంగా తెరకెక్కిన.. ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్ ట్రైలర్ నేడు సోమవారం (ఆగస్ట్ 19) నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది.  ఇక ఈ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే.. మరో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ముందుకు పరిచయం కాబోతున్నట్లు కనిపిస్తోంది.   25 ఏళ్ల కిందట అనగా.. 1999లో జరిగిన ఈ హైజాక్ ఘటన దేశాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే షాక్ కు గురి చేసింది. ఆ ఘటనను ఆధారంగా చేసుకొని వస్తున్న సిరీసే ఈ ఐసీ 814: ది కాందహార్ హైజాక్. ఇక ఏడు రోజుల పాటు జరిగిన ఈ హైజాక్ డ్రామా.. ప్రపంచ చరిత్రలో అతి సుదీర్ఘ హైజాక్ కావడం గమనార్హం. అందుకే ఈ వెబ్ సిరీస్ కూడా ఎంతో ఆసక్తి రేపేలా సాగబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇకపోతే అప్పటికే  హైజాక్ ఘటన తెర వెనుక ఏం జరిగింది అనేది ఈ సిరీస్ లో చూపించబోతున్నారు.

ఇదిలా ఉంటే.. దర్శకుడు అనుభవ్ సిన్హా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ అనేది.. కెప్టెన్ దేవి శరణ్, శ్రింజయ్ చౌదురి రాసిన పుస్తకం ‘ఫ్టైల్ ఇన్‌ టూ ఫియర్ ఆధారంగా తెరకెక్కింది. కాగా, ఈ సిరీస్ లో నసీరుద్దీన్ షా, విజయ్ వర్మ, అరవింద్ స్వామి, దియా మీర్జా, పత్రలేఖ, కుముద్ మిశ్రా, దిబ్యేందు భట్టాచార్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 29 నుంచి ప్రముఖ నెట్ ఫ్లిక్స్ లో ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది.

ఇక ఐసీ 814: ది కాందహార్ కథ విషయానికొస్తే.. హైజాక్ సమయంలో ఢిల్లీలోని వార్ రూమ్ లో జరిగిన ఘటనలను ఈ సిరీస్ లో కళ్లకు కట్టినట్టుంది. అలాగే  మొదట అమృత్‌సర్ కి విమానాన్ని తీసుకెళ్లిన హైజాకర్లు.. తర్వాత దానిని కాందహార్ కు ఎందుకు తరలించారు? అందులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కూడా ఈ సిరీస్ లో చూపించబోతున్నారు. కాగా, ఇప్పటికే ఈ  ట్రైలర్ చూస్తే వెంటనే ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసేయాలని ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మరి… తాజాగా రిలీజైన్ ఈ ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments