iDreamPost

ఈ వీకెండ్‌లో OTTలో చూడాల్సిన మూవీలు, వెబ్‌సిరీస్‌లు ఇవే.. ఓ లుక్కేయండి

  • Published Jun 07, 2024 | 10:35 AMUpdated Jun 07, 2024 | 10:35 AM

Weekend OTT Releases: ఈ వీకెండ్‌ ఓటీటీల్లోకి బోలేడు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. మరి వీటిల్లో ఏవి చూడాలి అంటే..

Weekend OTT Releases: ఈ వీకెండ్‌ ఓటీటీల్లోకి బోలేడు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. మరి వీటిల్లో ఏవి చూడాలి అంటే..

  • Published Jun 07, 2024 | 10:35 AMUpdated Jun 07, 2024 | 10:35 AM
ఈ వీకెండ్‌లో OTTలో చూడాల్సిన మూవీలు, వెబ్‌సిరీస్‌లు ఇవే.. ఓ లుక్కేయండి

వీకెండ్‌ వస్తుందంటే చాలు.. ఒకప్పుడు ఆ వారం విడుదల కాబోయే సినిమాల కోసం ఎదురు చేసేవారు. కానీ ఓటీటీలకు క్రేజ్‌ పెరిగిన తర్వాత.. ఆ పంథా మారింది. ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లకుండా.. ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల కోసం ఎదురు చూస్తుంటారు. అలానే మరో వీకెండ్‌ వచ్చింది. ఈవారం ప్రేక్షకులను అలరించడానికి చాలా కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వారం చాలా చిత్రాలు ఉండటంతో.. వీటిల్లో ఏం చూడాలనే కన్ఫ్యూజన్‌లో ఉన్నారు ప్రేక్షకులు. మరి ఏ ఓటీటీల్లో ఏ సినిమా, వెబ్ సిరీస్ ఉందో తెలుసుకోండి. వీకెండ్ పక్కాగా ప్లాన్ చేసుకొని వాటిని చూసేయండి. ఆ లిస్ట్‌ మీ కోసం..

వీకెండ్ ఓటీటీ రిలీజెస్

బడే మియా చోటే మియా- నెట్‌ఫ్లిక్స్

బాలీవుడ్‌లో ఈ ఏడాది భారీ బడ్జెట్‌తో తెరకెక్కి.. తీవ్రంగా నిరాశ పర్చిన చిత్రం.. అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన బడే మియా చోటే మియా. ఈ సినిమా గురువారం (జూన్ 6) నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. యాక్షన్‌ సినిమాలంటే ఆసక్తి ఉన్న వారు.. దీన్ని చూడవచ్చు.

బ్లాకౌట్- జియో సినిమా

ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సీ నటించిన మూవీ బ్లాకౌట్. ఈ మధ్యే 12 ఫెయిల్ సినిమా ద్వారా భారీ విజయాన్ని అందుకున్న విక్రాంత్‌.. ఈసారి థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాడు. ఈ మూవీ శుక్రవారం అనగా జూన్‌ 7, నేటి నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్‌కి రెడీ అయ్యింది.

గుల్లక్ సీజన్ 4 (వెబ్ సిరీస్)- సోనీలివ్

సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ గుల్లక్ సీజన్ 4 ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. 4వ సీజన్ గురువారం అనగా జూన్‌ 6 నుంచి సోనీలివ్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. మిశ్రా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ కొత్త సీజన్‌లో అందించబోయే వినోదాన్ని చూసి సరదాగా నవ్వుకొండి.

వర్షంగల్కు శేషమ్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఈ ఏడాది వచ్చిన మరో సూపర్ హిట్ మలయాళం మూవీ వర్షంగల్కు శేషమ్. చిత్ర పరిశ్రమలో రాణించాలని కలలు కనే ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. ఈ ఏడాది విడుదలై.. రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ మలయాళ సినిమా శుక్రవారం అనగా జూన్‌ 7 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్- హాట్‌స్టార్

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 4 కూడా ఈ వారమే హాట్‌స్టార్‌లోకి వస్తోంది. ఈ యానిమేటెడ్ సిరీస్ కొత్త సీజన్‌లో ఆంజనేయుడు.. కుంభకర్ణుడితో చేయబోయే పోరాటం చూడవచ్చు. చిన్నారులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అంటున్నారు.

మిరల్- ఆహా ఓటీటీ

ఏడాదిన్నర కిందట తమిళంలో రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ గత నెలలో తెలుగులోనూ రిలీజైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాని మిరల్ సినిమా శుక్రవారం అనగా నేటి నుంచి ఆహా ఓటీటీలో విడుదల కానుంది.

105 మినిట్స్- ఆహా ఓటీటీ

హన్సిక నటించిన సింగిల్ క్యారెక్టర్ థ్రిల్లర్ మూవీ 105 మినిట్స్. ఈ సినిమా కూడా నేటి నుంచే అనగా శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలోకి రాబోతోంది.

కల్కి- ఈటీవీ విన్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన చిత్రం కల్కి. ఈ సినిమా గురువారం (జూన్ 6) నుంచే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

మైదాన్- ప్రైమ్ వీడియో

అజయ్ దేవగన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా మైదాన్ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇన్నాళ్లూ రెంటల్ విధానంలో తీసుకొచ్చిన ప్రైమ్‌ వీడియో.. ఇప్పుడు ఉచితంగా చూసేందుకు అవకాశం కల్పిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి