Keerthi
టాలీవుడ్ కామెడియన్ వెన్నెలకిషోర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ కామెడీ మూవీ చారి 111. అయితే ఈ సినిమా గత కొన్ని రోజులుగా ఓటీటీలోకి వస్తుందనే టాక్ వినిపిస్తునే ఉంది కానీ దీనిపై ఎటువంటి అధికర ప్రకటన రాలేదు. కానీ తాజాగా ఈ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకి ఎక్కడంటే..
టాలీవుడ్ కామెడియన్ వెన్నెలకిషోర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ కామెడీ మూవీ చారి 111. అయితే ఈ సినిమా గత కొన్ని రోజులుగా ఓటీటీలోకి వస్తుందనే టాక్ వినిపిస్తునే ఉంది కానీ దీనిపై ఎటువంటి అధికర ప్రకటన రాలేదు. కానీ తాజాగా ఈ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకి ఎక్కడంటే..
Keerthi
టాలీవుడ్ కామెడియన్ వెన్నెలకిషోర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ కామెడీ మూవీ ‘చారి 11’1. కాగా, ఈ సినిమాను ఈనెల అనగా మార్చి 1వ తేదీన థియేటర్లలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే స్పై కామెడీ మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రానికి టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించగా.. ఇందులో సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా నటించింది. ఇక చారి 111 మూవీని.. మిస్టర్ బీన్ హీరోగా నటించిన హాలీవుడ్ మూవీ జానీ ఇంగ్లీష్ స్ఫూర్తితో రూపొందించారు. అయితే.. మొదట ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, టీజర్స్, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ థియేటర్లలో చారి 111 సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షులను ఆకట్టుకోలేకపోయింది. పైగా ఓ మోస్తార్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. దీంతో ఈ మూవీని మరి కొన్ని రోజుల్లో ఓటీటీలో విడుదల కానుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.కానీ దీనిపై ఇంత వరకు అధికార ప్రకటన రాలేదు. కానీ, తాజాగా ఈ మూవీ ఎటువంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకి ఎక్కడంటే..
వెన్నెలకిషోర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘చారి 111’. కాగా, ఈ సినిమా వెన్నెల కిషోర్ కు ఆశించిన ఫలితాలను అందించ లేకపోయింది. ఇక థియేటర్లలో అంతగా అలరించని చారి 111 సినిమా.. విడుదలై 15 రోజులు గడవక ముందే ఓటీటీలో వచ్చేందుకు రెడీగా ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రేక్షకులు కూడా వెన్నెల కిషోర్ కామెడీ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందనని తెగ ఆసక్తి ఎదురు చూశారు. కాగా, ఈ మూవీ ఇప్పుడు ఎటువంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా నేడు అనగా శుక్రవారం ఏప్రిల్ 5న అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. ఇక ఈథియేటర్ లో ఈ మూవీ చూడకుండా మిస్ అయినవారు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చారి 111 మూవీని చూసి ఎంజాయ్ చేయండి. కాగా, చారి 111 మూవీలో.. వెన్నెలకిషోర్, సంయుక్త విశ్వ నాథన్ తో పాటు మురళీశర్మ, సత్య, తాగుబోతు రమేష్ కీలక పాత్ర పోషించారు.
ఇక చారి 111 మూవీ కథ విషయానికొస్తే.. రా, ఎన్ఐఏ లకు ధీటుగా రుద్రనేత్ర పేరుతో ముఖ్యమంత్రి (శుభలేఖ సుధాకర్) ఓ స్పెషల్ ఎజెన్సీను ఏర్పాటు చేస్తాడు. అయితే హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో బాంబ్‌బ్లాస్ట్ జరుగుతుంది. అక్కడ కేసుకు రుద్రనేత్రకు చెందిన ఓ స్పెషల్ ఏజెంట్ చారి (వెన్నెలకిషోర్) చేపడతాడు. ఇక సీరియస్ ఇష్యూను సిల్లీగా, సిల్లీ కేసును సీరియస్‌గా డీల్ చేయడం చారి స్పెషాలిటీ. ఇక బాంబు బ్లాస్ట్ కేసులోని అసలైన నేరస్తులను చారి కనిపెట్టాడా? కెమికల్ క్యాప్సుల్స్‌తో బాంబు బ్లాస్ట్‌లకు పాల్పడుతోన్న రావణ్‌కు ప్రసాదరావుతో ఉన్న సంబంధం ఏమిటి? చారితో పాటు మరో ఏజెంట్ ఈషా (సంయుక్త విశ్వనాథన్) రావణ్‌ను పట్టుకున్నారా? సీరియస్ కేసు సాల్వ్ చేసే క్రమంలో చారి చనిపోయాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ. మరి, సైలెంట్ గా వెన్నెల కిషోర్ చారి 111 ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.