iDreamPost
android-app
ios-app

వీడియో: బ్లాక్ బస్టర్ సిరీస్ కి సీజన్ 2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Published May 15, 2024 | 3:08 PM Updated Updated May 15, 2024 | 3:08 PM

The Lord Of The Rings: The Rings Of Power Season 2: ఓటీటీల్లో వెబ్ సిరీస్లకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ హాలీవుడ్ వెబ్ సిరీస్లకు ఇండియాలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ఇది పండగలాంటి వార్తనే చెప్పాలి.

The Lord Of The Rings: The Rings Of Power Season 2: ఓటీటీల్లో వెబ్ సిరీస్లకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ హాలీవుడ్ వెబ్ సిరీస్లకు ఇండియాలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ఇది పండగలాంటి వార్తనే చెప్పాలి.

  • Published May 15, 2024 | 3:08 PMUpdated May 15, 2024 | 3:08 PM
వీడియో: బ్లాక్ బస్టర్ సిరీస్ కి సీజన్ 2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మీరు ఎన్ని సినిమాలు చూసినా కూడా వెబ్ సిరీస్ చూసిన ఫీల్ మాత్రం రాదు. ఎందుకంటే రెండున్నర గంటల సినిమాలో 30 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ఉంటే.. వెబ్ సిరీస్లో మాత్రం ఎపిసోడ్లకి ఎపిసోడ్లు యాక్షన్ ఉంటుంది. అదిరిపోయే ట్విస్టులు, కామెడీ.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఎక్స్ ట్రీమ్ గా ఉంటాయి. అందుకే వెబ్ సిరీస్లను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అందుకే మేకర్స్ కూడా వెబ్ సిరీస్లను తీసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అంతేకాకుండా.. ఓటీటీ ప్లాట్ ఫామ్సే స్వయంగా వెబ్ సిసీస్లను నిర్మిస్తున్నాయి కూడా. అలా ఇప్పుడు ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ అదిరిపోయే వెబ్ సిరీస్ కి సీజన్ 2 తీసుకురాబోతోంది. అందుకు సంబంధించి టీజర్ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.

సాధారణంగా హాలీవుడ్ వెబ్ సిరీస్లు అంటే తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. అందుకు కారణం అందులో ఉండే యాక్షన్ సీక్వెన్స్ కారణం కావచ్చు. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన సిరీస్ కి ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. 2022లో వచ్చి.. ఈ వెబ్ సిరీస్ వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్, మంచి అప్లాజ్ పొందింది. అలాంటి సిరీస్ కి ఇప్పుడు సీజన్ 2 ప్రకటించారు. ఆ సిరీస్ మరేదో కాదు.. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్. ఈ వెబ్ సిరీస్ ని లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మూవీ సిరీస్ కి ప్రీక్వెల్ గా తీసుకొచ్చారు. సీజన్ 1కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అందుకే సీజన్ 2 కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.

ఇప్పుడు ఆ సీజన్ 2కి సంబంధించి అధికారిక ప్రకటన రానే వచ్చింది. అందుకు సంబంధించి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ సీజన్ 2 ట్రైలర్ మొదటి సీజన్ కంటే కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడియన్స్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నిజంగానే పిచ్చెక్కిపోతున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ క్రేజ్ ని, ఆ ఫ్యాన్ బేస్ ని ఈ వెబ్ సిరీస్ తో కొనసాగించగలుగుతున్నారు. మొదటి సీజన్లో ప్రధానంగా ఉన్న గ్లాడ్రిఎల్, ఎల్రోండ్, ఆరోండిర్, లార్డ్ సెలెబ్రింబోర్, హై కింగ్ గిల్-గెలాడ్ పాత్రలు, ఆ రాజ్యాల చుట్టూనే తిరిగేలా చూపించారు. అయితే యాక్షన్, ట్విస్టులు, ఎమోషన్స్ విషయంలో మొదటి సీజన్ ని కచ్చితంగా మరిపించేస్తారు అని చెప్పచ్చు.

ట్రైలర్ చూసిన తర్వాత ఆ భావన అయితే కచ్చితంగా కలుగుతోంది. ముఖ్యంగా ఎల్ఫ్స్- ఆర్క్స్ కింగ్ ఆడార్ మధ్య బీభత్సమైన యుద్ధాలు జరిగే ఆస్కారం కనిపిస్తోంది. అలాగే ఎల్ఫ్స్ తమ జీవితాలను నిలబెట్టుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. కథ మరింత ఆసక్తిగా మారుతోంది. కొత్త కొత్త విలన్స్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఎల్ఫ్స్ కూడా వారి సొంతవారితోనే పోరాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి రెండేళ్ల తర్వాత ఈ సీజన్ 2 ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. ఈసారి కూడా తెలుగులో కచ్చితంగా ఉండే ఆస్కారం ఉంది. మరి.. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş