iDreamPost
android-app
ios-app

అఫీషియల్: అదిరిపోయే ఫాంటసీ సిరీస్ సీక్వెల్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Published Jul 27, 2024 | 4:48 PM Updated Updated Jul 27, 2024 | 4:48 PM

The Lord Of The Rings: Rings Of Power Season 2 Trailer: అదిరిపోయే ఫాంటసీ సిరీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఈ సిరీస్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పటికే ఒక సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రెండో సీజన్ రాబోతోంది.

The Lord Of The Rings: Rings Of Power Season 2 Trailer: అదిరిపోయే ఫాంటసీ సిరీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఈ సిరీస్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పటికే ఒక సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రెండో సీజన్ రాబోతోంది.

  • Published Jul 27, 2024 | 4:48 PMUpdated Jul 27, 2024 | 4:48 PM
అఫీషియల్: అదిరిపోయే ఫాంటసీ సిరీస్ సీక్వెల్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రపంచవ్యాప్తంగా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మూవీ ఫ్రాంచైజ్ కి కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా సిరీస్ కు వచ్చిన రెస్పాన్స్, ఆస్కార్లు, అవార్డులు, రివార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఈ ఫాంటసీ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్, ఉన్న అభిమాన గణాన్ని క్యాచ్ చేయడానికి ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కి ప్రీక్వెల్ స్టోరీని రాసుకుని దానిని వెబ్ సిరీస్ కి మార్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్ కి సంబంధించి ఒక సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కూడా అవుతోంది. 2022లో వచ్చిన ఈ సీజన్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఈ లార్డ్ ఆఫ్ ది రింగ్స్: రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 వచ్చేస్తోంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. రిలీజ్ డేట్ ని ప్రస్తావిస్తూ.. ట్రైలర్ ని విడుదల చేశారు.

లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లో చెప్పాలి అనుకున్న కథను చెప్పేశారు. ఇంక దానిని కొనసాగించడానికి అవకాశం లేదు. అందుకే ఛాన్స్ తీసుకుని అసలు ఇదంతా జరగక ముందు.. కథ ఎలా స్టార్ట్ అయ్యింది? ఆ రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి? వారి మధ్య సత్సంబంధాలు, వారి జీవనం, వారికి ఉన్న కష్టాలు ఇలా చాలానే పాయింట్స్ హైలెట్ చేసుకుంటూ సీజన్ 1ని చూపించారు. అయితే ఇప్పుడు సీజన్ 2కి ఆ రింగ్స్ ని చూపించారు. అలాగే సౌలోన్ ని కూడా పరిచయం చేశారు. ఆ రింగ్స్ అతనికి కావాలి అని.. అతను వాటికోసం ఏదైనా చేస్తాడు అనే విషయాలను హైలెట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఆ ఉంగరాలను రాజులు ధరిస్తారు. వాటిని ధరించడం వల్ల అనర్థాలు జరుగుతుంది అని ఎంత చెప్పినా వాళ్లు వినరు.

అసలు ఆ సౌలోన్ ఎవరో తెలుసుకోవాలి అని ఎల్వ్స్ మహారాజు కూడా అనుకుంటాడు. మరోవైపు అన్ని రాజ్యాల్లో ఊహించని పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఉంగరాలు ధరించిన మహారాజులు వింతగా ప్రవరిస్తూ ఉంటారు. వాళ్లు చాలా లోబి మనస్తత్వాన్ని పొందుతారు. అసలు వాళ్లు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోతారు. ఈ సీజన్ లో కూడా యాక్షన్ పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రైలర్ తోనే ఈ సీజన్ 2 మీద అంచనాలను భారీగా పెంచేశారు. ఎక్కడా కూడా మొదటి సీజన్ కు తగ్గదు అని బలంగా చెప్పచ్చు. ఇంక ఈ లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 ఆగస్టు 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి.. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş