iDreamPost
android-app
ios-app

సడెన్ గా OTT లో బర్త్ డే బాయ్ మూవీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Aug 09, 2024 | 11:11 AM Updated Updated Aug 09, 2024 | 11:11 AM

The Birthday Boy OTT Streaming :రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా ది బర్త్ డే బాయ్ మూవీ.. రిలీజ్ కు ముందే ప్రేక్షకులలో.. సినిమాపై ఓ రకమైన క్యూరియాసిటీని పెంచింది. థియేట్రికల్ రిలీజ్ విషయంలో చేసినట్లే ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ లో కూడా.. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది ఈ మూవీ.

The Birthday Boy OTT Streaming :రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా ది బర్త్ డే బాయ్ మూవీ.. రిలీజ్ కు ముందే ప్రేక్షకులలో.. సినిమాపై ఓ రకమైన క్యూరియాసిటీని పెంచింది. థియేట్రికల్ రిలీజ్ విషయంలో చేసినట్లే ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ లో కూడా.. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది ఈ మూవీ.

  • Published Aug 09, 2024 | 11:11 AMUpdated Aug 09, 2024 | 11:11 AM
సడెన్ గా OTT లో బర్త్ డే బాయ్ మూవీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

సాధారణంగా బాగా బజ్ సంపాదించుకున్న సినిమాలు.. ఓటీటీ లోకి వస్తున్నాయంటే కనీసం వారం పది రోజుల ముందు నుంచే.. ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన ఎదో ఒక టాక్ వినిపిస్తూనే ఉంటుంది. కానీ రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయిన ది బర్త్ డే బాయ్ మూవీ విషయంలో మాత్రం ఇలా జరగలేదు. అసలు ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సడెన్ గా ప్రీమియర్స్ అంటూ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ను ప్రకటించారు మేకర్స్. దీనితో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసినట్లయింది. మరి బర్త్ డే బాయ్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

విస్కీ దాసరి దర్శకత్వం వహించిన ‘ది బర్త్ డే బాయ్’ మూవీ.. రిలీజ్ కు ముందే.. సినిమాపై ఓ ప్రేక్షకులలో ఓ రకమైన క్యూరియాసిటీని పెంచేసింది. టీజర్ దగ్గర నుంచి మూవీ ప్రమోషన్స్ వరకు ప్రతిదీ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో.. సోషల్ మీడియాలో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్టే జూలై 19న థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది ఈ సినిమా. కాగా ఈ సినిమాలో ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌ క‌న‌కాల లాంటి నటి నటులు ముఖ్య పాత్రలలో నటించారు. కానీ చిన్న సినిమా కావడంతో రీచ్ తక్కువ ఉండి.. థియేటర్ లో ఎక్కువ రోజులు రన్ కాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా సడెన్ గా ఓటీటీ ప్రీమియర్స్ అంటూ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ను ప్రకటించింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహలో ఆగష్టు 9 మధ్యాహ్నం 2 గంటల నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఇక ది బర్త్ డే బాయ్ సినిమా కథ విషయానికొస్తే.. బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి ఈ నలుగురు కూడా చిన్నప్పటినుంచి మంచి ఫ్రెండ్స్. వీరంతా కలిసి పై చదువుల కోసం అమెరికా వెళ్తారు. అంతా బాగానే సాగిపోతున్న సమయంలో.. ఓ రోజు ఆ స్నేహితులతో ఒకడైన బాలు బర్త్ డే కావడంతో.. ఆ సెలెబ్రేషన్స్ ను గ్రాండ్ గా చేయాలనీ ప్లాన్ చేస్తారు. వారు అనుకున్నట్లుగానే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసి.. బాగా తాగేసి.. బాలుపై సరదాగానే శృతి మించిన దాడి చేస్తారు. ఈ క్రమంలో అబుకోకుండా బాలు చనిపోతాడు. దీనితో మిగిలిన వారికి ఏం చేయాలో అర్థంకాక.. అర్జున్ అన్నకు జరిగినదంతా చెప్తారు. ఈ విషయం తెలిసిన బాలు పేరెంట్స్ కూడా అమెరికాకు వస్తారు. ఆ తర్వాత ఏమైంది ? బాలు ప్రమాదవ శాత్తు చనిపోయాడా లేదా కావాలని ఎవరైనా చంపేశారా ? తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాను కూడా మీ వీకెండ్ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుని.. ఎంచక్కా చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetgrandpashabetmeritbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetantikbet girişEscortes BelgiqueHoliganbetGrandpashabetJojobetCasibom GirişCasibom