iDreamPost
android-app
ios-app

OTT లోకి తెలుగు యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. ‘సత్య’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Published Sep 03, 2024 | 12:30 AM Updated Updated Sep 03, 2024 | 12:30 AM

OTT New Releases- Telugu Movie Satya: థియేటర్స్ లో రిలీజ్ అయినా కొన్ని సినిమాలు చాలా ఫాస్ట్ గా ఓటీటీ లోకి వచ్చేస్తుంటే.. కొన్ని సినిమాలు మాత్రం ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఓ తెలుగు రొ*మాంటిక్ మూవీ థియేటర్ లో రిలీజ్ అయినా నాలుగు నెలల తర్వాత.. ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

OTT New Releases- Telugu Movie Satya: థియేటర్స్ లో రిలీజ్ అయినా కొన్ని సినిమాలు చాలా ఫాస్ట్ గా ఓటీటీ లోకి వచ్చేస్తుంటే.. కొన్ని సినిమాలు మాత్రం ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఓ తెలుగు రొ*మాంటిక్ మూవీ థియేటర్ లో రిలీజ్ అయినా నాలుగు నెలల తర్వాత.. ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

  • Published Sep 03, 2024 | 12:30 AMUpdated Sep 03, 2024 | 12:30 AM
OTT లోకి తెలుగు యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. ‘సత్య’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఓటీటీ లోకి ఏ జోనర్ లో సినిమాలు వచ్చినా కానీ.. ఆయా సినిమాల కథలను బట్టి ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. ఇక కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయంటే.. అవి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఈ మధ్య చాలా వరకు సినిమాలన్నీ థియేటర్ లో రిలీజ్ అయినా నెల లోపే ఓటీటీ లోకి వస్తుంటే కొన్ని సినిమాలు మాత్రం ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఓ తెలుగు రొమాంటిక్ మూవీ థియేటర్ లో రిలీజ్ అయినా నాలుగు నెలల తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు .. ఇంట్రెస్టింగ్ టీనేజీ లవ్ డ్రామా సత్య.. మే 10న తమిళ్ డబ్బింగ్ మూవీ గా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. తమిళంలో రంగోలి పేరుతో రిలీజ్ అయినా ఈ సినిమాకు డీసెంట్ రెస్పాన్స్ ఏ వచ్చింది. ఇక తెలుగులో కూడా అటు ఇటుగా మంచి స్పందనే లభించింది. ఇక ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయినా ఇన్ని నెలలకు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 7 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్నీ ఆహా.. “మన స్కూల్ లైఫ్ కనిపిస్తుంది.. సత్య సెప్టెంబర్ 7 నుంచి మీ ఆహాలో..” అనే క్యాప్షన్ తో ప్రకటించింది. కాబట్టి ఈ టీనేజీ లవ్ స్టోరీని.. ఈ వీకెండ్ అసలు మిస్ చేయకుండా చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇదొక టీనేజీ లవ్ స్టోరీ.. సత్య అనే అతను తనకు ఇష్టం లేకపోయినా సరే.. ఓ కార్పొరేట్ కాలేజ్ లో ఇంటర్ చదవడానికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత అతను పార్వతి అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె కూడా సత్యను ఇష్టపడుతుంది. కానీ బయటపడదు.. కానీ అనుకోకుండా అతన్నే చెంపదెబ్బ కొడుతుంది. దీనితో ఏకంగా అతను ఆ కాలేజీనే వదిలేయాలని అనుకుంటాడు. పైగా తన కుటుంబం కోసం ఓ నిర్ణయం కూడా తీసుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది ? ఆ నిర్ణయం ఏంటి ? వాళ్ళ ప్రేమ కథ ఎంత వరకు కొనసాగింది? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.