OTT లోకి రొ*మాంటిక్ కామెడీ డ్రామా ‘కొంజమ్ పెసినాల్ ఎన్న’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Feel Good Movie: ఈ వారం ఇప్పటికే అనౌన్స్ చేసిన సినిమాలతో పాటు.. మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఈ లిస్ట్ లో యాడ్ అవ్వబోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

OTT Feel Good Movie: ఈ వారం ఇప్పటికే అనౌన్స్ చేసిన సినిమాలతో పాటు.. మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఈ లిస్ట్ లో యాడ్ అవ్వబోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పుడు ఎలాగూ తెలుగు , తమిళం అని తేడా లేకుండా సినిమాలను చూస్తున్నారు కాబట్టి.. ఈ సినిమాను చాలా ఈజీగా చూసేయొచ్చు. ఎందుకంటే ఇప్పడు చెప్పుకోబోయేది ఓ తమిళ సినిమా గురించి.. అసలు ఇప్పుడు ఈ తమిళ సినిమా గురించి ఎందుకని అనుకుంటున్నారా.. దేనికంటే..ఆల్రెడీ ఈ వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అనే.. విషయం గురించి చూసే ఉంటారు. ఇక వాటిలోనుంచి వీకెండ్ వాచ్ లిస్ట్ ను కూడా సెపరేట్ చేసి ఉంటారు. ఈ క్రమంలో మీ వీకెండ్ వాచ్ లిస్ట్ లో యాడ్ అవ్వడానికి.. మరొక ఇంట్రెస్టింగ్ తమిళ మూవీ రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు చూసేద్దాం.

ఈ సినిమా పేరు.. ‘కొంజమ్ పెసినాల్ ఎన్న’. ఈ సినిమా థియేటర్ లో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చేస్తుంది. మే 23 న థియేటర్ లో రిలీజైన ఈ సినిమా.. ఫీల్ గుడ్ లవ్ డ్రామా అనే మిక్స్డ్ టాక్ తో థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇన్నాళ్లకు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. అయితే ఈ మధ్య మొదట కొన్ని సినిమాలను ఒరిజినల్ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ చేసి.. అప్పడు వచ్చే టాక్ ను బేస్ చేసుకుని.. తెలుగులో స్ట్రీమింగ్ ను చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే రూల్ ను ఫాలో అవుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమాను కేవలం తమిళ్ లో మాత్రమే రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహలో ఆగష్టు 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇక కొంజమ్ పెసినాల్ ఎన్న సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా.. చిన్నపటినుంచి ప్రేమలో ఉన్న ఇద్దరు లవర్స్ చుట్టూ కొనసాగుతుంది. అజయ్ , సంజన ఇద్దరు కూడా చిన్నతనం నుంచే ఒకరు ఇష్టపడుతూ.. ప్రేమించుకుంటారు . కానీ ఆ తర్వాత.. వారిద్దరూ కొన్ని అనుకోని పరిస్థితిల్లో దూరమవుతారు. ఇక కొన్నాళ్ళకు సోషల్ మీడియా ద్వారా మళ్ళీ కలుస్తారు. క్రమంగా వారి మధ్య ప్రేమ కూడా బలపడుతుంది. కానీ మరి కొన్ని రోజులకు వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇలా వారిద్దరి మధ్య సాగే ప్రయాణమే ఈ మూవీ కథ.. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments