iDreamPost
android-app
ios-app

వీడియో: సుడిగాలి సుధీర్ పై కాజల్ ఆగ్రహం.. షోలో అందరి ముందే..

  • Published May 13, 2024 | 8:35 PM Updated Updated May 13, 2024 | 8:35 PM

Sudigali Sudheer- Kajal Agarwal: బుల్లితెర మెగాస్టార్ సుడిగాలి సుధీర్ పై చందమామ కాజల్ అగర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. యాంకర్ పై ఉగ్రరూపం దాల్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Sudigali Sudheer- Kajal Agarwal: బుల్లితెర మెగాస్టార్ సుడిగాలి సుధీర్ పై చందమామ కాజల్ అగర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. యాంకర్ పై ఉగ్రరూపం దాల్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

  • Published May 13, 2024 | 8:35 PMUpdated May 13, 2024 | 8:35 PM
వీడియో: సుడిగాలి సుధీర్ పై కాజల్ ఆగ్రహం.. షోలో అందరి ముందే..

కాజల్ అగర్వాల్.. ఈ స్టార్ హీరోయిన్ కి పాన్ ఇండియా లెవల్లో సూపర్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. తల్లి అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసేసింది. తాజాగా లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఏసీపీగా వచ్చేస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న సర్కార్ సీజన్ 4కి కాజల్ వచ్చేసింది. ఆ కార్యక్రమంలో అందం, అభినయంతోనే కాదు.. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో కూడా ఆడియన్స్ ని అలరించింది. అంతేకాకుండా ఒకానొక సమయంలో ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది.

సుడిగాలి సుధీర్ బుల్లితెరకు దూరమైన విషయం తెలిసిందే. కామెడీ షోకి దూరంగా ఉంటూ హీరోగా బిజీగా మారిపోయాడు. అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కోసం సర్కార్ సీజన్ 4కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఆ సీజన్ కు ఓటీటీలో మంచి ఆదరణ లభించింది. అంతేకాకుండా ఓటీటీ ఆహాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆ క్రేజ్ ని రెండింతలు చేసే ఎపిసోడ్ వచ్చేస్తోంది. చందమామ కాజల్ అగర్వాల్ సర్కార్ సీజన్ 4 ఎపిసోడ్ 5లో సందడి చేసింది. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్లో కాజల్ అగర్వాల్ వరుస పంచులతో ఇరగదీసేసింది.

సర్కార్ సీజన్ 4.. 5వ ఎపిసోడ్ లో సత్యభామ మూవీ టీమ్ సందడి చేసింది. కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర ఫుల్ హంగామా సృష్టించారు. అమ్మాయిలను ఎలా పడేయాలో నవీన్ చంద్ర సుడిగాలి సుధీర్ కి నేర్పించే ప్రయత్నం చేశాడు. ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలో నవీన్ చంద్ర సుడిగాలి సుధీర్ కు ట్యూషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ స్టేజ్ మొత్తాన్ని కబ్జా చేసేసింది. కాజల్ కు డిఫరెంట్ గా వెల్ కమ్ చెప్పారు. రెడ్ రోజెస్ తీసుకుని చిన్నారులు కాజల్ కు స్వాగతం చెప్పారు. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ కూడా ఒక చాక్లెట్ తీసుకుని నేనూ చిన్నపిల్లాడినే అంటూ చాక్లెట్ ఇచ్చాడు. ఆ తర్వాత గేమ్ షో స్టార్ట్ చేశారు.

ఆ గేమ్ లో కాజల్ లో ఉండే పంతాన్ని కూడా చూపించారు. ఒక క్వశ్చన్ కు పంతానికి పోయి రూ.2 లక్షలు పందెంకాసేసింది. ఏదైతే అది తగ్గేదేలే అంటూ ఆమె చూపించిన యాటిట్యూడ్ కి అంతా షాకయ్యారు. ఇంక ఒక టాస్క్ లో కాజల్ కు డబ్బులు లెక్కపెట్టే టాస్క్ ఇచ్చారు. అందుకు 60 సెకండ్స్ టైమ్ ఉంటుంది. ఆ టాస్కులో కాన్సన్ ట్రేట్ చేయకుండా సుధీర్ కదిలించాడని చందమామకు కోపం కట్టలు తెంచుకుంది. కానీ, సుధీర్ మాత్రం కాజల్- ఆమె కుమారుడి ఫొటో ఉన్న టీషర్ట్ చూపించి కూల్ చేసేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. మరి.. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş