iDreamPost
android-app
ios-app

OTTని షేక్ చేస్తున్న సుడిగాలి సుధీర్.. ఇదేం క్రేజ్ సామి..!

  • Published May 11, 2024 | 7:14 PM Updated Updated May 11, 2024 | 7:14 PM

Sudigali Sudheer- Sensational Records In OTT: సుడిగాలి సుధీర్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ, గుర్తింపు ఉంది. నటుడిగా, హీరోగా, కమెడియన్ గా, డ్యాన్సర్ గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇప్పుడు ఓటీటీలో సుడిగాలి సుధీర్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు.

Sudigali Sudheer- Sensational Records In OTT: సుడిగాలి సుధీర్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ, గుర్తింపు ఉంది. నటుడిగా, హీరోగా, కమెడియన్ గా, డ్యాన్సర్ గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇప్పుడు ఓటీటీలో సుడిగాలి సుధీర్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు.

  • Published May 11, 2024 | 7:14 PMUpdated May 11, 2024 | 7:14 PM
OTTని షేక్ చేస్తున్న సుడిగాలి సుధీర్.. ఇదేం క్రేజ్ సామి..!

సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక చిన్న మెజీషియన్ గా తన కెరీర్ ప్రారంభించాడు సుధీర్. ఆ తర్వాత కామెడీ షోలో స్కిట్లలో యాక్ట్ చేసేందుకు వెళ్లాడు. ఆ తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. ఆ తర్వాత ఒక హోస్ట్ గా మారిపోయాడు. ఎన్నో అద్భుతమైన షోస్ కి యాంకర్ గా చేశాడు.. చేస్తున్నాడు. ఆ తర్వాత హీరో అవతారమెత్తాడు. నిజానికి హోస్ట్ గా ఉన్నప్పుడే సుడిగాలి సుధీర్ కు ఒక చిన్న సైజ్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉండేది. యూట్యూబ్ లో ఏ వీడియో కింద చూసినా సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ హంగామా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ హీరో ఓటీటీని షేక్ చేస్తున్నాడు.

సుడిగాలి సుధీర్ కు బుల్లితెర మెగాస్టార్ అనే బిరుదు వచ్చేసింది. అయితే అది అంత తేలిగ్గా రాలేదు. కొన్నేళ్లు సుధీర్ పడిన కష్టం, భరించిన అవమానాలకు నిదర్శనం ఆ బిరుదు. ఆ తర్వాత సుధీర్ కు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. సరైన్ హిట్టు కోసం సుధీర్ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సుధీర్ కామెడీ షోకి దూరమైన తర్వాత ఫ్యాన్స్ ఎంతగానో బాధ పడ్డారు. వారం వారం టీవీలో చూసే తమ అభిమాన నటుడు, డ్యాన్సర్, యాంకర్ కనిపించలేదని ఫీల్ అయ్యారు. అయితే ఫ్యాన్స్ కోసం సుధీర్ స్పెషల్ షోస్ లో వచ్చి సందడి చేశాడు.

ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సుడిగాలి సుధీర్ మరోసారి హోస్ట్ గా మారిన విషయం తెలిసిందే. గతంలో యాంకర్ ప్రదీప్ చేసిన సర్కార్ గేమ్ షోకి సుధీర్ హోస్ట్ గా చేస్తున్నాడు. సర్కార్ సీజన్ 4కి సుధీర్ హోస్ట్ గా చేసిన నాలుగు ఎపిసోడ్స్ కూడా విడుదల అయ్యాయి. యాంకరింగ్ అంటే యాంకర్ ప్రదీప్ కు మంచి గుర్తింపు ఉంది. కానీ, ఆ షోకి ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా సుధీర్ మెయిన్ టైన్ చేస్తున్నాడు. నిజానికి ఆ క్రేజ్ మరింత పెంచాడు అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సుధీర్ సర్కార్ సీజన్ 4 ఓటీటీని షేక్ చేస్తోంది. ఆహాలో టాప్ 10లో సుధీర్ సర్కార్ సీజన్ 4 టాప్ లో ఉంది.

ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ తమ ఓటీటీలో ఎక్కువ మంది ఆడియన్స్ చూస్తున్న సినిమాలు/ వెబ్ సిరీస్ల గురించి ప్రకటిస్తూ ఉంటుంది. నిజానికి ఓటీటీలోనే టాప్ 10 అనే కేటగిరీ ఉంటుంది. అందులో ఎవరు ఎక్కువగా ఏ మూవీ చూస్తున్నారో దాంట్లో ఉంటుంది. ఈ కేటగిరీలో ఆహా ప్లాట్ ఫామ్ లో టాప్ ప్లేస్ లో సుడిగాలి సుధీర్ సర్కార్ సీజన్ 4 ఎపిసోడ్ 3 ట్రెండ్ అవుతోంది. ఆహాలో ఉన్న ఎన్నో మూవీ, వెబ్ సిరీస్లను వెనక్కి నెట్టేసి ఒక గేమ్ షో ట్రెండ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇది నిజంగా సుడిగాలి సుధీర్ క్రేజ్ కి ప్రత్యక్ష ఉదాహరణ అనే చెప్పాలి. మరి.. ఇంకెందుకు ఆలస్యం ఆహాలో సుడిగాలి సుధీర్ సర్కార్ సీజన్ 4 మీరు కూడా చూసేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet