Swetha
Stree 2 Movie OTT Partner: 2018 లో వచ్చిన స్త్రీ మూవీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు అదే క్రేజ్ ను ఉపయోగించుకుని.. ఆ సినిమాకు సిక్వెల్ గా స్త్రీ2 సినిమాను ఆగష్టు 15 న థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ అప్పుడే ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకున్నట్లు సమాచారం.
Stree 2 Movie OTT Partner: 2018 లో వచ్చిన స్త్రీ మూవీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు అదే క్రేజ్ ను ఉపయోగించుకుని.. ఆ సినిమాకు సిక్వెల్ గా స్త్రీ2 సినిమాను ఆగష్టు 15 న థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ అప్పుడే ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకున్నట్లు సమాచారం.
Swetha
హర్రర్ కామెడీ చిత్రాలు ఏ లాంగ్వేజ్ లో వచ్చినా కానీ.. వాటికి మంచి బజ్ ఏర్పడుతుంది. ఈ క్రమంలో 2018 లో రిలీజ్ అయినా స్త్రీ మూవీకి ఆ సమయంలో వచ్చిన బజ్ అంతా ఇంతా కాదు. తక్కువ బడ్జెట్ తో థియేటర్ లో అడుగుపెట్టి.. బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ రికార్డ్స్ ను క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు అదే క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని.. ఐదేళ్ల తర్వాత ఈ సినిమాకు సిక్వెల్ గా స్త్రీ2 సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఆగష్టు 15న థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కు ఇంకా సమయం ఉండగానే .. ఈ మూవీ ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ వివరాలను చూసేద్దాం.
ఈ మధ్య కాలంలో థియేటర్ లో సినిమాలు రిలీజ్ కాకముందే.. ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకోవడం అనేది చాలా సాదారణ విషయం అయిపొయింది. బాగా బజ్ ఉన్న సినిమాల కోసం ముందుగానే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్.. పోటీ పడుతున్నాయి. ఇక ఆ తర్వాత థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు స్త్రీ 2 మూవీ ఓటీటీ డీల్ కూడా డీసెంట్ ధరలకే క్లోజ్ చేశారట మేకర్స్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై అందరికి మంచి బజ్ ఉంది కాబట్టి.. లాంగ్ రన్ లో థియేటర్ ప్రేక్షకులను బాగానే మెప్పిస్తుంది. దీనిని బట్టి చూస్తే.. అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక స్త్రీ 2 మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్, రాజ్‍కుమార్ రావ్‍తో పాటు పంజక్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ అంతా కూడా మధ్య ప్రదేశ్ లోని చందేరి గ్రామంలో కొనసాగుతూ ఉంటుంది. అక్కడ మహిళలను అపహరించే కొన్ని దుష్టశక్తులను హరించే దిశగా వారికి ఎదురయ్యే పరిస్థితులు ఏంటి అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ మూవీ స్టోరీ కొనసాగుతుంది. సుమారు రూ.25కోట్ల బడ్జెట్‍తో రూపొందించిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.