iDreamPost
android-app
ios-app

త్వరలోనే మీర్జాపూర్ సీజన్ 4 వస్తోంది.. అప్ డేట్ ఇచ్చిన నటి!

  • Published Jul 09, 2024 | 5:14 PM Updated Updated Jul 09, 2024 | 5:14 PM

Shernavaz Jijina Said Mirzapur Season 4 Is Coming Shortly: మీర్జాపూర్ సీజన్ 3 ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు త్వరలోనే సీజన్ 4 కూడా రాబోతోంది అంటూ నటి కన్ఫమ్ చేసింది.

Shernavaz Jijina Said Mirzapur Season 4 Is Coming Shortly: మీర్జాపూర్ సీజన్ 3 ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు త్వరలోనే సీజన్ 4 కూడా రాబోతోంది అంటూ నటి కన్ఫమ్ చేసింది.

  • Published Jul 09, 2024 | 5:14 PMUpdated Jul 09, 2024 | 5:14 PM
త్వరలోనే మీర్జాపూర్ సీజన్ 4 వస్తోంది.. అప్ డేట్ ఇచ్చిన నటి!

మీర్జాపూర్.. పాన్ ఇండియా లెవల్లో ఈ వెబ్ సిరీస్ ఒక ఎమోషన్. ఈ వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత ఇండియన్ ఓటీటీ ఫ్యాన్స్ ఎంతో మంది వెబ్ సిరీస్లు చూడటానికి అలవాటు పడ్డారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి మూడు సీజన్స్ వచ్చాయి. మొదటి సీజన్ రిలీజ్ సమయంలో వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఆడియన్స్ దగ్గరి నుంచి క్రిటిక్స్, ట్రోలర్స్, ఫ్యాన్స్, మేకర్స్ అంతా ఈ సిరీస్ గురించే మాట్లాడుకున్నారు. సీజన్ ని ఎలా స్టార్ట్ చేశారో.. ఎలా ఎండ్ చేశారో చూస్తే.. పిచ్చెక్కిపోతారు. అలాంటి సిరీస్ ఇప్పుడు కాస్త నెమ్మదించిన విషయం తెలిసిందే. సీజన్ 3 మీద పెద్దగా బజ్ లేదు. అసలు ఈ సీజన్ ఉందో లేదో కూడా తెలీదు. ఇదిలా ఉంటే ఇప్పుడు సీజన్ 4 గురించి అప్ డేట్ వచ్చేసింది.

మీర్జాపూర్ సిరీస్ ఇండియన్ ఓటీటీలో ఒక జెమ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, తొలి సీజన్ కి వచ్చిన అప్లాజ్, రెస్పాన్స్ మిగిలిన వాటికి రాలేదు. అంటే సీజన్ 2కి ఆడియన్స్ లో కాస్త జోష్ తగ్గింది. ఎందుకే ఫస్ట్ సీజన్ ఎమోషన్, ఎలివేషన్, వైలెన్స్ క్యారీ కాలేదు అనే అభిప్రాయాలు వినిపించాయి. అలాగే సీజన్ 3 వచ్చిన తర్వాత ప్రేక్షకులు మరింత డీలా పడిపోయారు. అసలు అమెజాన్ ప్రైమ్ లో మీర్జాపూర్ సీజన్ 3 ఉంది అని కూడా చాలా మంది పట్టించుకోవడం లేదు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.. వైలెన్స్ తగ్గడం, మున్నా భాయ్ లేకపోవడం, కాలిన్ భయ్యా ఆగమనం ఆలస్యం అవ్వడమే ప్రధాన కారణంగా చెప్పచ్చు.

మీర్జాపూర్ సీజన్ 3 మీద ఇంతలా ట్రోల్ జరుగుతున్న తరుణంలో అందులో నటించిన నటి ఏకంగా మీర్జాపూర్ సీజన్ 4 గురించి అప్ డేట్ ఇచ్చేసింది. మీర్జాపూర్ సిరీస్ లో తొలి సీజన్ నుంచి నటిస్తున్న షెర్నావాజ్ జిజినా ఈ అప్ డేట్ తీసుకొచ్చింది. తాను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ సమయంలో మీర్జాపూర్ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సిరీస్ కి సంబధించి ప్రస్తుతం నాలుగో సీజన్ కి సంబంధించి వర్క్ జరుగుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న విషయాన్ని కన్ఫామ్ చేసింది. అంతా ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారని చెప్పింది.

అంత త్వరగా ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ అసలు ఎలా తీయగలుగుతున్నారో తనకు అర్థం కావడం లేదు అంటూ నటి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీజన్ 3పై వస్తున్న ట్రోల్స్ కి సంబంధించి కూడా ఆమె స్పందించింది. అన్ని సినిమాలు, సిరీస్లకు మీర్జాపూర్ భిన్నంగా ఉంటుందని తెలిపింది. తొలి సీజన్ సమయంలో వైలెన్స్ కి సంబంధించి అందరూ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంది. అయితే సీజన్ 4 మాత్రం ఎవరి ఊహకు అందదు అంటూ ఆమె స్పష్టం చేసింది. మరి.. మీర్జాపూర్ సీజన్ 4 త్వరలోనే వస్తుంది అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş