iDreamPost
android-app
ios-app

Scam 2010 WebSeries: స్కామ్ సిరీస్ లో సరికొత్త సీజన్.. ఈసారి సుబ్రతా రాయ్ హిస్టరీ

  • Published May 16, 2024 | 9:45 PM Updated Updated May 17, 2024 | 10:11 AM

వెబ్ సిరీస్ ల మాట వస్తే కనుక.. స్కామ్ అనే వెబ్ సిరీస్ పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సిరీస్ లకు సరికొత్త సీజన్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వెబ్ సిరీస్ ల మాట వస్తే కనుక.. స్కామ్ అనే వెబ్ సిరీస్ పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సిరీస్ లకు సరికొత్త సీజన్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published May 16, 2024 | 9:45 PMUpdated May 17, 2024 | 10:11 AM
Scam 2010 WebSeries: స్కామ్ సిరీస్ లో సరికొత్త సీజన్.. ఈసారి సుబ్రతా రాయ్ హిస్టరీ

ఇప్పుడు సినిమాలకంటే కూడా వెబ్ సిరీస్ లకే ఆదరణ బాగా లభిస్తుంది. దీనితో ఎప్పుడో రిలీజ్ చేసిన వెబ్ సిరీస్ లకు కూడా ఇప్పుడు కొత్త సీజన్స్ ను రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో బెస్ట్ వెబ్ సిరీస్ లిస్ట్ లో వినిపించే పేరు.. స్కామ్. ఇప్పటికే స్కామ్ 1992, స్కామ్ 2003 అంటూ వచ్చిన వెబ్ సిరీస్ లు ఏ రేంజ్ లో హిట్స్ ను అందుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పరత్యేకించి వెబ్ సిరీస్ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని. ఈ స్కామ్ వెబ్ సిరీస్ కు సరికొత్త సీజన్ ను ప్రకటించారు మేకర్స్. అసలు ఏంటి స్కామ్ వెబ్ సిరీస్ ఎందుకు ఇంత పాపులర్ అయింది. ఈ సరికొత్త సీజన్ ను ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు అనే విషయాలను చూసేద్దాం.

స్కామ్ వెబ్ సిరీస్ ను ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా రూపొందించారు. స్కామ్ 1992, స్కామ్ 2003 పేరుతో ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. మొదటి వెబ్ సిరీస్ లో 1992 లో బయటపడిన హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ గురించి చూపించగా.. రెండవ వెబ్ సిరీస్ లో అబ్దుల్ కరీం తెల్గీ స్టాంప్ పేపర్ స్కామ్ గురించి చూపించారు మేకర్స్. ఈ రెండిటికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఇప్పుడు కొత్త సీజన్ ను.. స్కామ్ 2010 ది సుబ్రతా రాయ్ సాగా అనే టైటిల్ తో.. అనౌన్స్ చేశారు మేకర్స్. అంటే ఈ సీజన్ లో సహారా సంస్ధల అధినేత.. ప్రముఖ వ్యాపార వేత్త.. దివంగత సుబ్రతా రాయ్ స్టోరీని చూపించనున్నారు. సహారా: ది అన్‌టోల్డ్ స్టోరీ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సిరీస్ ను కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీ లివ్ లోనే రిలీజ్ చేయనున్నారు. కొత్త సీజన్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.

స్కామ్ 2010 విషయానికొస్తే.. సహారా సంస్థల అధినేత సుబ్రతా రాయ్ పై చిట్ ఫండ్ అవకతవకలు, నకిలీ ఇన్వెస్టర్ల ఆరోపణలు ఉన్నాయి. దాని కారణంగా ఈ కేసు విషయమై 2014 లో ఆయనను అరెస్ట్ చేశారు. ఇప్పటికి కూడా ఈ స్కామ్ కు సంబంధించి రూ.25 వేల కోట్ల మొత్తం.. ప్రభుత్వ అధికార వర్గాల దగ్గర అలాగే ఉంది. ఇక దాని గురించి పూర్తిగా చూపించే ప్రయత్నమే ఈ స్కామ్ సరికొత్త సీజన్. ఇక దీని గురించి హన్సల్ స్పందిస్తూ.. “స్కామ్ నాకు కేవలం ఓ ఫ్రాంఛైజీ మాత్రమే కాదు. మన కాలంలో జరిగిన వృత్తాంతాన్ని చెప్పడం. అలాంటిదే మరో గొప్ప స్టోరీ కోసం మరోసారి అప్లౌజ్, సోనీలివ్ లతో కలిసి పని చేయనుండటం సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఈ సీజన్ ఎంత మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.