iDreamPost
android-app
ios-app

హిట్టు కాంబో రిపీట్.. ఈసారి నేరుగా OTTలోకి వచ్చేస్తున్నారు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Published May 13, 2024 | 6:13 PM Updated Updated May 13, 2024 | 6:13 PM

Vidya Vasula Aham Movie OTT Release Date: రాహుల్ విజయ్- శివానీ రాజశేఖర్ మరోసారి హిట్టు కొట్టబోతున్నట్లే కనిపిస్తున్నారు. కోట బొమ్మాళి తర్వాత ఈ మూవీ హిట్టు కొడితే వారికి సక్సెస్ ఫుల్ పెయిర్ అనే ట్యాగ్ కూడా వచ్చేస్తుంది.

Vidya Vasula Aham Movie OTT Release Date: రాహుల్ విజయ్- శివానీ రాజశేఖర్ మరోసారి హిట్టు కొట్టబోతున్నట్లే కనిపిస్తున్నారు. కోట బొమ్మాళి తర్వాత ఈ మూవీ హిట్టు కొడితే వారికి సక్సెస్ ఫుల్ పెయిర్ అనే ట్యాగ్ కూడా వచ్చేస్తుంది.

  • Published May 13, 2024 | 6:13 PMUpdated May 13, 2024 | 6:13 PM
హిట్టు కాంబో రిపీట్.. ఈసారి నేరుగా OTTలోకి వచ్చేస్తున్నారు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. ఒక హీరో హీరోయిన్ కలిసి చేసిన మూవీ బ్లాక్ బస్టర్ అయితే.. ఆ కాంబో రిపీట్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అలాగే ఇప్పుడు ఒక హిట్టు కాంబో రిపీట్ అవుతోంది. అది కూడా ఆ మూవీ నేరుగా ఓటీటీలోకి రాబోతుండటం మరింత ఇంట్రెస్టింగ్ విషయం. ఆ కాంబో మరెవరో కాదు.. కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ హీరో రాహుల్ విజయ్, హీరోయిన్ శివానీ రాజశేఖర్. వీళ్లిద్దరు కోటబొమ్మాళి పీఎస్ మూవీతో సాలిడ్ హిట్టు కొట్టారు. ఇప్పుడు మరోసారి ఆ కాంబో రిపీట్ అవుతోంది. ఈసారి కూడా గట్టిగానే కొట్టేటట్లు కనిపిస్తున్నారు. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.

శివానీ రాజశేఖర్ ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్ తో టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. మరోవైపు రాహుల్ విజయ్ కూడా మంచి ఆర్టిస్టుగా గుర్తింపు అయితే పొందేశాడు. కోటబొమ్మాళి మూవీలో వీళ్లని సీనియర్ శ్రీకాంత్ డామినేట్ చేసేశాడు. కానీ, ఇప్పుడు వీళ్లు ఇద్దరూ హీరోహీరోయిన్స్ గా కొత్త మూవీ చేశారు. ఆ మూవీ మరేదో కాదు.. ‘విద్య వాసు అహం’ అనే చిత్రం. దీనిని పోస్టర్ లో వివాహం అనేది హైలెట్ చేస్తూ చూపించారు. ఇప్పటివరకు వచ్చిన టీజర్స్ చూస్తే ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తో వస్తోంది. ఎందుకంటే ఈ మూవీ మోస్ట్ కామన్ ఎలిమెంట్స్ తో వస్తోంది. అదేంటంటే.. పెళ్లి, సంసారం, అహం, ఈగో గొడవలు. ఈ పాయింట్స్ ప్రతి ఒక్కరికి కనెక్టింగ్ పాయింట్.

ఈ మూవీ ఒక కామన్ అండ్ స్ట్రాంగ్ ఎలిమెంట్ తో తీసుకొస్తున్నారు. పైగా రాహుల్ విజయ్- శివానీల పర్ఫార్మెన్స్ కూడా ఎంతో ఫ్రెష్ గా ఉంది. ప్రేమ, ఈగో, గొడవలు వంటి సీన్స్ లో ప్రాణం పెట్టి నటించినట్లు కనిపిస్తోంది. పైగా వీళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది. అహం లేదు అంటూనే తన ఈగోని భార్య మీద రుద్దే పాత్రలో రాహుల్ విజయ్ ఇరగదీశాడు. ఇంక ఈగోతో పోరాటం చేస్తూ.. తన అహాన్ని కూడా చూపించే విద్య పాత్రలో శివానీ జీవించేసింది. ఈ మూవీ ట్యాగ్ లైన్.. లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ. మొత్తానికి చాలా గట్టిగానే ప్లాన్ చేశారని అర్థమైపోయింది.

ఈ విద్య వాసు అహం మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇది ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ విషయాన్ని ఆహార వీడియో వాళ్లు అధికారికంగా ప్రకటించారు. మే 17 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ లోపు ఒక మంచి ట్రైలర్ ని కూడా విడుదల చేసేటట్లు కనిపిస్తున్నారు. టీజర్ కే ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇంక ట్రైలర్ అంటే మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. ఇప్పటికే రాహుల్ విజయ్, శివానీ కెరీర్లలో ఇది బెస్ట్ మూవీ అవుతుందని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి.. నేరుగా ఓటీటీలోకి రాబోతున్న విద్య వాసుల అహం మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetkolik girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş