iDreamPost
android-app
ios-app

Prathinidhi 2: ఓటీటీలోకి నారా రోహిత్ మూవీ ప్రతినిధి 2 ! స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే!

Prathinidhi 2: టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయ్యింది. మరి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Prathinidhi 2: టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయ్యింది. మరి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Prathinidhi 2: ఓటీటీలోకి నారా రోహిత్  మూవీ ప్రతినిధి 2 ! స్ట్రీమింగ్  ఎప్పటి నుంచంటే!

ప్రతి వారం ఓటీటీలోకి  అనేక సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. థియేటర్లలో రిలీజైన మూవీసే కాకుండా నేరుగా కూడా పలు సినిమాలో ఓటీటీలోకి వస్తుంటాయి. ఇక సినీ ప్రియులు థియేటర్లలో చూడటంతో పాటు ఓటీటీలో సినిమాలు చూసేందుకు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఓటీటీకి సంబంధించిన సమాచారం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఏ ఏ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. తాజాగా నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 సినిమాకు కూడా ఓటీటీలోకి రానుంది. మూడు నెలల క్రితం విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎదో చూసేద్దాం.

టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక విభిన్నమైన సినిమాల్లో నటించి..తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపును సంపాదించారు. పొలిటికల్ బ్యాక్ ట్రాప్ తో వచ్చిన ప్రతినిధి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సొంతం చేసుకుంది. ఆ సినిమాలో నారా రోహిత్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులో వేశారు. ఆ సినిమాకు సీక్వెల్ ప్రతినిధి సినిమా వచ్చింది. ఇది కూడా పొలిటికల్ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఈ ఏడాది మే 10న ఈ చిత్రం విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద వద్ద ఆశించిన స్థాయిలో విజయం అందుకులేదు. జస్ట్ యావరేజ్ టాక్ తో థియేటర్లలో నుంచి నిష్క్రమించింది. ఇక దాదాపు మూడు నెలల గ్యాప్ తరువాత ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.

సెప్టెంబర్  27వ తేదీన ఈ సినిమాలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది.  ఇక ప్రతినిధి 2 సినిమాను మూర్తి దేవగుప్తపు  దర్శకత్వం వహించారు. అలానే కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, బొల్లినేని సురేంద్రనాథ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో  నారా రోహిత్ తో పాటు సిరీలెల్ల, సప్తగిరి, జిషు సేన్ గుప్తా సచిన్ ఖేడేకర్, ఇంద్రజ, ఉదయభాను, అజయ్ ఘోష్, రఘుబాబు వంటి వారు నటించారు. అయితే చాలా సినిమాలు థియేటర్లో అట్టర్ ప్లాప్ అయ్యి..ఓటీటీలో మాత్రం దుమ్ములేపాయి. ఆ కోవాలోనే ప్రతినిధి 2 సినిమా ఓటీటీలో సక్సెస్ అవుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమా ఓటీటీలో  ఏమేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే..మరికొన్ని రోజులు ఆగాల్సిందే.