iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆగస్టులోనే OTTలోకి ‘కల్కి’!

  • Published Jul 31, 2024 | 9:55 AM Updated Updated Jul 31, 2024 | 9:55 AM

Kalki 2898 AD OTT Platform:సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే కల్కి ఓటీటీ రైట్స్ ఎవరు దక్కించుకున్నారు.. ఎప్పుడు స్ట్రీమింగ్ అనే దానిపై ఆసక్తి నెలకొంది.

Kalki 2898 AD OTT Platform:సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే కల్కి ఓటీటీ రైట్స్ ఎవరు దక్కించుకున్నారు.. ఎప్పుడు స్ట్రీమింగ్ అనే దానిపై ఆసక్తి నెలకొంది.

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆగస్టులోనే  OTTలోకి ‘కల్కి’!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది నటవారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.. అందులో కొద్దిమంది మాత్రమే స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారు. అలాంటి వారిలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్ ’చిత్రంతో మాస్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో రేంజ్ కి ఎదిగాడు. సినిమాల విషయంలో ఆయనకున్న డిడెకేషన్ ఈ స్థాకియి తీసుకువచ్చిందని అంటారు. బాహుబలి సీరీస్ తర్వాత ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గుర్తింపు వచ్చింది. ప్రభాస్ నటించే ప్రతి మూవీపై భారీ అంచనాలు ఉంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ సినిమాలు కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ‘కల్కి’ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇక కల్కి మూవీ ఓటీటీ లో ఎప్పుడు స్ట్రీమింగ్ అనే దానిపై ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. తొలిరోజు నుంచే థియేటర్లలో వసూళ్లు సునామీ సృష్టిస్తూ వచ్చింది. తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి రుచి చూపించారు. రూ.600 కోట్ల బడ్జెట్ తో అద్భుతమైన సాంకేతికతతో.. భారీ తారాగణంతో తెరెక్కించిన ‘కల్కి’ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అని కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రభాస్ లాంటి కటౌట్ కి తగ్గ చిత్రం అని అభిమాను తెగ మురిసి పోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ 1200 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఓటీటీలో ఎప్పుడు రిజీల్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ‘కల్కి’ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.

Kalki into OTT

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రిలీజ్ అయి నెల దాటింది. ఒకటీ రెండు థియేటర్లు తప్ప దాదాపు అన్ని చివరకొచ్చేసినట్లే.. మరి ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని మూడీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కల్కి ఓటీటీ తెలుగు హక్కల్ని అమేజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని వార్తలు వచ్చాయి. ముందుగానే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 23న ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ కాది కాకుంటే స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆగస్టు 15న తీసుకువచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు అని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా తమ అభిమాన హీరో మూవీ ఓటీటీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis