iDreamPost
android-app
ios-app

OTTలో విజయ్ సేతుపతి నట విశ్వరూపం.. పోలీసులపై పోరాటం చేస్తూ..

  • Published Mar 25, 2024 | 8:49 PM Updated Updated Mar 25, 2024 | 8:49 PM

OTT Suggestions: ఓటీటీలో చాలానే సినిమాలు ఉన్నాయి. కానీ, ఏది చూడాలో అర్థం కాదు. మంచి యాక్షన్ డ్రామా చూడాలి అనుకుంటే మాత్రం మీకు ఇది బెస్ట్ మూవీ సజీషన్ అవుతుంది.

OTT Suggestions: ఓటీటీలో చాలానే సినిమాలు ఉన్నాయి. కానీ, ఏది చూడాలో అర్థం కాదు. మంచి యాక్షన్ డ్రామా చూడాలి అనుకుంటే మాత్రం మీకు ఇది బెస్ట్ మూవీ సజీషన్ అవుతుంది.

  • Published Mar 25, 2024 | 8:49 PMUpdated Mar 25, 2024 | 8:49 PM
OTTలో విజయ్ సేతుపతి నట విశ్వరూపం.. పోలీసులపై పోరాటం చేస్తూ..

వీకెండ్ అయిపోయింది. థియేటర్లలో సినిమాలు విడుదలకు ఇంకా రెండ్రోజుల సమయం ఉంది. మరి.. ఈ 2 డేస్ టైమ్ పాస్ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఓటీటీలో చాలానే సినిమాలు ఉన్నాయి. కానీ, వాటిలో ఏం చూడాలో అర్థం కావడం లేదా? అందుకే మీకోసం ఓటీటీ సజీషన్స్ రూపంలో మంచి మంచి మూవీస్, వెబ్ సిరీస్లు అందిస్తూనే ఉన్నాం. ఈసారి కూడా అలాంటి ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాం. ఇది ఓటీటీలో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. అలాగే విజయ్ సేతుపతి కెరీర్లో కూడా బెస్ట్ మూవీగా ఉంది. మరి.. ఆ సినిమా ఏది? ఆ మూవీ ఎందుకు అంత స్పెషల్ చూడండి మరి.

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్, తెలుగు మాత్రమే కాదు.. హిందీలో కూడా విజయ్ సేతుపతి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. విజయ్ సేతుపతి ఎంచుకునే కథలు కూడా అలాగే డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఈ విడుతలై కూడా ఒకటి. ఈ మూవీ జీ5లో అందుబాటులో ఉంది. ఈ విడుతలైలో మరో లీడ్ యాక్టర్ కూడా ఉన్నాడు. అతను మరెవరో కాదు.. ప్రముఖ హాస్య నటుడు సూరి. నిజానికి ఈ విడుతలై సినిమాలో హీరో అంటే సూరి అనే చెప్పాలి. ఈ మూవీలో విజయ్ సేతుపతి కీ రోల్ ప్లే చేశాడు. 1987లో ఒక నక్సల్ గ్రూప్ తమిళనాడులో రైలు పట్టాలు తప్పేలా చేస్తారు. ఆ ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. వందల మంది గాయాలపాలవుతారు.

మైనింగ్ కు ఇచ్చిన అనుమతులకు వ్యతిరేకంగా అలా చేస్తారు. ఆ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఆ మొత్తం నక్సల్ గ్రూప్ ని ఎలాగైనా పట్టుకోవాలి అని ఫిక్స్ అవుతారు. అందుకే ఆ పని కోసం ఒక పోలీస్ టీమ్ ని ఏర్పాటు చేస్తారు. ఆ నక్సల్ గ్రూప్ లీడరే విజయ్ సేతుపతి. అతని కోసం పోలీసులు ప్రతి ప్రాంతాన్ని జల్లెడపడుతూ ఉంటారు. అయితే విజయ్ సేతుపతి ఒక మారుమూల గ్రామంలో ఉంటాడు. ఆ ప్రాంతంలో డ్రైవర్ గా కుమరేశన్(సూరి) రిక్రూట్ అవుతాడు. కుమరేశన్ అప్పుడప్పుడే అక్కడి విషయాలకు అలవాటు పడుతూ ఉంటాడు.

కుమరేశన్ చాలా ఊహించుకుని డ్యూటీలోకి వెళ్తాడు. కానీ, అక్కడ చెక్ పోస్టలలో ఉండే పోలీసులకు భోజనాలు ఇవ్వడానికే సమయం సరిపోతుంది. అతనికి సరైన డ్యూటీ ఎవ్వరు ఇవ్వరు. నిజానికి కుమరేశన్ షూటింగ్ లో చాలా టాలెంటెడ్. కానీ అతని లెంట్ కి తగ్గ అవకాశం మాత్రం దక్కదు. అదే నిరాశతో పని చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో మక్కల్ పడాయ్ లీడర్ వాతియార్ కు సంబంధించిన సమాచారం అందుతుంది. కుమరేశన్ కూడా వాతియార్ కోసం వెళ్తాడు. అక్కడ ఏం జరిగింది? అసలు కుమరేశన్ అనుకున్నది సాధించాడా? విజయ్ సేతుపతి ఎందుకు రైలు ప్రమాదానికి కారణం అయ్యాడు. వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇది కేవలం మొదటి పార్ట్ మాత్రమే. విడుతలై రెండో పార్ట్ లో అసలు కథ ఉండబోతోంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş