iDreamPost
android-app
ios-app

హాట్ స్టార్ లో ఈ టాప్ 5 యానిమేటెడ్ మూవీస్ ఎలా మిస్ అయ్యారు?

OTT Suggestions- Top Rated Animated Movies: మీరు ఇప్పటికీ చిన్న పిల్లలతో కలిసి యానిమేషన్ సినిమాలు చూస్తారా? అయితే మీకోసం టాప్ 5 టాప్ రేటెడ్ యానిమేటెడ్ సినిమాలు తీసుకొచ్చాం.

OTT Suggestions- Top Rated Animated Movies: మీరు ఇప్పటికీ చిన్న పిల్లలతో కలిసి యానిమేషన్ సినిమాలు చూస్తారా? అయితే మీకోసం టాప్ 5 టాప్ రేటెడ్ యానిమేటెడ్ సినిమాలు తీసుకొచ్చాం.

హాట్ స్టార్ లో ఈ టాప్ 5 యానిమేటెడ్ మూవీస్ ఎలా మిస్ అయ్యారు?

యానిమేషన్ సినిమాలు అనగానే.. మీరేమైన చిన్నపిల్లలా అనే డైలాగ్ కచ్చితంగా వినిపిస్తుంది. కానీ, యానిమేటెడ్ సినిమాల్లో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో ఆ మూవీస్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేశాయి కూడా. అలాంటి యానిమేటెడ్ సినిమాల్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కొన్ని యానిమేటెడ్ సినిమాలు, కథలు ఉన్నాయి. వాటిలో ఒక టాప్ 5 సినిమాలను మీకోసం తీసుకొచ్చాం. నిజంగా మీరు యానిమేషన్ అనగానే చిన్న పిల్లల సినిమా అని లైట్ తీసుకుంటే చాలా మంచి మంచి కథలను మీరు మిస్ అయిపోతున్నారు అని అర్థం. ఆ చిత్రాల్లో మంచి మంచి సందేశాలు కూడా ఉంటాయి.

టాయ్ స్టోరీ:

దాదాపుగా చాలా మందికి ఈ టాయ్ స్టోరీ అనే సినిమా తెలిసే ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ఈ మూవీ అంత పాపులర్ కాబట్టి. అయితే ఈ సినిమా కథ దాదాపుగా ఒకేలా ఉంటుంది. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలకు మాటలు, హృదయం, ఆలోచన, ఎమోషన్స్ ఉంటే ఎలా ఉంటుంది? అనే అంశాన్ని హైలెట్ చేస్తూ ఈ టాయ్ స్టోరీ సినిమాని తెరకెక్కించారు. అయితే ఇది కేవలం ఒక్క సినిమా కాదు.. ఇందులో చాలానే పార్ట్స్ ఉన్నాయి. ఒకసారి స్టార్ట్ చేస్తే ఆపడం కష్టంగా ఉంటుంది.

రాటటోయిల్:

ఈ సినిమా పేరే మీకు కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. కానీ, ఇందులో ఒక షెఫ్, ఒక ఎలుకకు మధ్య బాండింగ్ కు ఎమోషనల్ అయిపోతారు. ఆ ఎలుకకు ఎంతో గొప్ప షెఫ్ కావాలి అనేది కోరిక. కానీ, ఆ రెస్టారెంట్లో ఉండే షెఫ్స్ అంతా మహా ముదుర్లలా కనిపిస్తారు. కానీ, ఒక అమాయకపు- బద్ధకపు- వంట అసలు రాని షెఫ్ ఉంటాడు. అతని కంట్రోల్(జుట్టు పట్టుకుని) చేస్తూ ఈ ఎలుక రకరకాల వంటలు ప్రిపేర్ చేస్తుంది. మొదటి నుంచి ఆ రెస్టారెంట్లో ఉన్న అనుభవంతో ఏ వంట అయినా పర్ఫెక్ట్ గా చేసేస్తుంది. అలా వాళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాతే వారి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది.

జూటోపియా:

జూటోపియా అనేది పూర్తిగా జంతువుల నేపథ్యంలో జరిగే సినిమా. ఈ మూవీలో కొన్ని జంతువులు కలిసి జీవిస్తూ ఉంటాయి. ఆ జంతువులు ఉండే ఊరు పేరు జూటోపియా. ఈ మూవీ పేరు కూడా అదే అవ్వడం విశేషం. ఇంక ఈ గ్రామంలో ఒక తెలివైన, చురుకైన కుందేలు ఆఫీసర్ గా ఉంటుంది. అలాగే ఒక తెలివైన నక్క కష్టపడకుండా డబ్బు సంపాదించడం చేస్తుంటుంది. దానిని అరెస్టు చేయబోయిన కుందేలు.. దానితో స్నేహం చేస్తుంది. ఆ తర్వాత పెద్ద డిటెక్టివ్ కావాలి అనుకున్న ఆ నక్క తనలో ఉన్న టాలెంట్ ని అక్కడి నుంచి బయట పడేస్తుంది. ఈ మూవీ మొత్తం క్రేజీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.

ది గుడ్ డైనోసార్:

మీరు చిన్నప్పటి నుంచి యానిమేటెడ్ సినిమాలు చూస్తే ఉంటే మాత్రం.. మీకు ఈ సినిమా కచ్చితంగా నచ్చేస్తుంది. ఈ సినిమా పేరు ది గుడ్ డైనోసార్. ఇది డైనోసార్లు ఉన్నప్పటి కాలంలో జరిగిన మనుషుల కథగా చూపిస్తారు. ఈ కథలో తల్లిదండ్రుల నుుంచి ఒక పసి కందు విడిపోతుంది. ఆ రోజుల్లో డైనోసార్లు వ్యవసాయం చేస్తుంటే.. మనుషులు మాత్రం ఆదివాసుల్లా ఉన్నట్లు చూపించారు. ఈ సినిమాలో ఫ్యాన్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఆ చిన్న కుర్రాడు.. ఆ డైనోసార్ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? ఎలా ఒకరికొకరు సహాయ పడ్డారు అనే విషయాలను ఈ మూవీలో బాగా చూపించారు.

లూకా:

యానిమేటెడ్ సినిమా అంటే మీరు ఏదైనా కాస్త లిబర్టీ తీసుకొవచ్చు. అలాంటి లిబర్టీ నుంచి వచ్చిందే ఈ లూకా సినిమా. ఈ మూవీని ఒక డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్చించారు. ఈ చిత్రాన్ని ఎప్పుడో తెలుగులో వెంకటేశ్ తీసిన సాహస వీరుడు సాగర కన్య సినిమాలో శిల్పా శెట్టి మారినట్లు మారిపోతూ ఉంటారు. సముద్రంలో జీవించే ఒక వింత జాతి ఉంటుంది. అయితే నీళ్లల్లో మాత్రం ఒక విచిత్రమైన జంతువులా ఉంటాయి. కానీ, నేలపైకి రాగానే మనిషిలా మారిపోతుంది. అలా ఇద్దరు కుర్రాళ్లు తరచూ సిటీకి రావడం అలవాటు పడతారు. చిన్నగా మనుషుల జీవనశైలిని కూడా అలవరుచుకుంటారు. కానీ, వాళ్లు మనుషులు కాదు అని ఎలా తెలిసింది? ఎవరు అలాంటి పనులు చేశారు? అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ 5 చిత్రాలను మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేయచ్చు. ఈ మూవీస్లో మీరు ఏదైనా చిత్రాన్ని చూసుంటే అది.. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి