మనుషుల్ని ముక్కలుగా నరికి తినే అడవి జాతి.. OTT లో మీ మైండ్ ను డిస్టర్బ్ చేసే మూవీ

OTT Weird Adventure Movie: కొన్ని సినిమాలు చూస్తుంటే.. తెలియకుండానే కాస్త ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి. కొన్ని సీన్స్ ఎంత భయంకరంగా ఉన్నా సరే.. మూవీ లవర్స్ మాత్రం చూస్తూనే ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ విచిత్ర కథే. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Weird Adventure Movie: కొన్ని సినిమాలు చూస్తుంటే.. తెలియకుండానే కాస్త ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి. కొన్ని సీన్స్ ఎంత భయంకరంగా ఉన్నా సరే.. మూవీ లవర్స్ మాత్రం చూస్తూనే ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ విచిత్ర కథే. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

కొన్ని సినిమాలు చూడడానికి కాస్త ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి. సెన్సిటివ్ పీపుల్, వీక్ హార్ట్ పీపుల్ ఆ సినిమాలను చూడలేరు. ఇలాంటి సినిమాలు ఇప్పటివరకు చాలానే వచ్చాయి.. కొన్ని సినిమాలు చూస్తుంటే మనకు తెలియకుండానే.. ముఖంలో రకరకాల ఎక్సప్రెషన్స్ పలుకుతూ ఉంటాయి. ఇంకా కొన్ని సీన్స్ అయితే చాలా భయంకరంగా ఉంటాయి. అయినా సరే మూవీ లవర్స్ మాత్రం ఆ సినిమాలను వదిలిపెట్టకుండా చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు మాత్రం ఈ సినిమాను అసలు చూడొద్దు. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. అమెజాన్ అడవుల్లో రెండ్ హంటర్స్ అనే ఒక తెగ కు చెందిన ప్రజలు ఉంటూ ఉంటారు. అక్కడ ఓ పెద్దాయన తన మనుమరాలికి ఆహారాన్ని ఎలా సేకరించాలి అనేది చెప్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే కొంతమంది గ్రీన్ డ్రెస్ వేసుకుని.. చెట్లను నరుకుతూ ఉంటారు. ఇది చూసిన ఆ ముసలాయన అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మరొక సీన్ ను చూపిస్తారు. అమెరికాలోని ఓ యూనివర్సిటీలో లెక్చరర్ తన స్టూడెంట్స్ కు దేశంలోని రకరకాల ప్రాబ్లమ్స్ గురించి చెబుతూ ఉంటుంది. వాటిలో ఒకటి కొన్ని తెగల్లో ఉండే ఆడవారు తమ హక్కులను పొందాలంటే.. కొన్ని భయంకరమైన టెస్ట్స్ లు చేస్తూ ఉంటారు. అదేంటో తెలుసుకున్న ఆ స్టూడెంట్స్ చాలా షాక్ అవుతారు. ఆ స్టూడెంట్స్ లో ఓ లాయర్ కూతురు ఉంటుంది. ఆమె ఎలాగైనా ఈ వింత ఆచారాన్ని ఆపాలని అనుకుంటూ ఉంటుంది. అయితే ఆ స్టూడెంట్స్ అంతా కలిసి ఓసారి అమెజాన్ అడవుల్లో జరిగే ఓ అరాచకాన్ని ఆపడానికి బయల్దేరతారు.

వారంతా కలిసి కెమెరాలతో సహా .. ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని.. అమెజాన్ అడవుల్లోకి వెళ్తారు. అయితే అనుకోకుండా ఆ లాయర్ కూతురు జెస్టిన్ ప్రాబ్లమ్ లో చిక్కుకుంటుంది. ఎలాగూ ఒకలా అక్కడినుంచి తప్పించుకుని.. తిరిగి వెళ్లిపోతుండగా.. వాళ్ళ ఫ్లైట్ క్రాష్ అయ్యి.. అడవి మధ్యలో పడిపోతుంది. వారిలో సగం మంది చనిపోతారు. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఉన్నది రెడ్ హంటర్స్ ఉండే ప్లేస్ లో.. రెండ్ హంటర్స్ అంతా కూడా వీళ్ళను శత్రువులుగా భావిస్తారు. ఆ స్టూడెంట్స్ ను ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలుగా నరికి.. వండుకుని మరి తింటూ ఉంటారు. దీనిని మిగిలిన స్టూడెంట్స్ చూసి.. కనీసం వారైన తప్పించుకోవాలి అనుకుంటారు. కానీ అక్కడే ఉన్న కాపలా వాళ్లకు దొరికిపోతారు. అసలు ఆ రెడ్ హంటర్స్ ఎవరు ? ఎందుకు మనుషుల్ని చంపి తింటున్నారు? ఆ స్టూడెంట్స్ అక్కడినుంచి తప్పించుకుంటారా లేదా ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే.. “ది గ్రీన్ ఇన్ఫెర్నో” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్ లో కూడా ఉంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments