iDreamPost
android-app
ios-app

సైకో కిల్లర్ కు మరో కిల్లర్ తోడైతే.. OTT లో ఈ మూవీకి ఫ్యూజులు ఎగిరిపోతాయి

  • Published Jul 25, 2024 | 3:00 AM Updated Updated Jul 25, 2024 | 3:00 AM

OTT Suspense Thriller : కొన్ని సినిమాలు ట్విస్ట్స్ కోసమైనా సరే చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అదే క్యాటగిరిలోకి వస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

OTT Suspense Thriller : కొన్ని సినిమాలు ట్విస్ట్స్ కోసమైనా సరే చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అదే క్యాటగిరిలోకి వస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

  • Published Jul 25, 2024 | 3:00 AMUpdated Jul 25, 2024 | 3:00 AM
సైకో కిల్లర్ కు మరో కిల్లర్ తోడైతే.. OTT లో ఈ మూవీకి ఫ్యూజులు ఎగిరిపోతాయి

కేవలం దెయ్యాలు మాత్రమే కనిపించి భయపెట్టే హర్రర్ సినిమాలు ఓ రకం అయితే.. హర్రర్ కు సైకలాజికల్ ఎలిమెంట్స్ జోడిస్తే.. ఆ సినిమాలు ఇంకాస్తా ఇంట్రెస్టింగ్ ఉంటూ ఉంటాయి. ఇక కొన్ని సినిమాలు అయితే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్స్ కోసమైనా సరే.. ఖచ్చితంగా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఇప్పటివరకు చాలానే ఉంటాయి కానీ.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ లో ట్విస్ట్ లు చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా.. అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ ఆర్ఫన్ మూవీ సిరీస్ లో రెండో మూవీగా రిలీజ్ అయింది. మొదట మూవీ చూడకపోయినా కూడా రెండో మూవీ ఈజీగా అర్థమైపోతుంది. ఇక కథలోకి వెళ్తే.. 2007 ఎస్తోనియా దేశంలో యానా అనే డాక్టర్.. సిటీ కి దూరంగా ఉండే ఓ మానసిక రోగుల హాస్పిటల్ కు వెళ్తాడు. అక్కడకు వెళ్లిన తర్వాత.. ఓ డాక్టర్.. యానాకి వెల్కమ్ చెప్పి .. పేషంట్స్ ను పరిచయం చేస్తానని తీసుకుని వెళ్తుంది. అయితే ఈ గ్యాప్ లో మరొక డాక్టర్ వచ్చి లీనా అనే పేషంట్ అక్కడ లేదని.. కంగారు పడతారు. యానకి ఏమి అర్థంకాక ఎవరు ఆ లీనా ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని అడుగుతాడు. మా దగ్గర ఉన్న అత్యంత భయకరమైన పేషంట్ లీనా అని తనకి ట్రీట్మెంట్ ఇవ్వడానికే ఇక్కడకు పిలిపించాం అని చెప్తారు. అతనిని ఓ రూమ్ లో వదిలిపెట్టి.. అక్కడి నుంచి కదలొద్దని.. వెళ్లి లీనాని వెతుకుతాం అని మిగిలిన డాక్టర్స్ వెళ్ళిపోతారు.

కట్ చేస్తే యాన ఉన్న రూమ్ లోనే లీనా కూడా ఉంటుంది. ఆమె వయస్సు 31 అయినా కానీ చూడడానికి మాత్రం 8 ఏళ్ళ పాపాల కనిపిస్తుంది. ఆమె బయట ప్రపంచంలోకి వెళ్తే చాలా ప్రమాదం అని చెప్పి.. ఆమెకు ఫుల్ సెక్యూరిటీ పెట్టిస్తారు. అయినా సరే ఓ రోజు లీనా ఆ హాస్పిటల్ నుంచి పారిపోవాలని చూస్తుంది. సరిగ్గా అదే సమయంలో యానా కంట పడడంతో.. అతను లీనాను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆమె అంతా గందరగోళం చేసి.. యానాను చంపేస్తుంది. అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి ఒంటరిగా రోడ్ పైన కూర్చుంటుంది. ఆ తర్వాత ఏమైంది ? అసలు ఎవరు ఈ లీనా ? ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది ? ఆమె వలన బయట ప్రపంచానికి వచ్చే ప్రమాదం ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే “ఆర్ఫన్: ఫస్ట్ కిల్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom